Saturday, November 23, 2024

మిన‌ర‌ల్ వాట‌ర్ వ్యాపారంలోకి టిఎస్ఆర్టీసీ….మార్కెట్ లోకి ‘జీవా’ విడుద‌ల‌…

హైద‌రాబాద్ – టిఎస్ఆర్టీసీ త‌న ఆదాయాన్ని పెంచుకునేందుకు మిన‌రల్ వాట‌ర్ వ్యాపారంలోకి దిగింది.. జీవా పేరుతో వాట‌ర్ అమ్మ‌కాల‌కు నేటి నుంచి శ్రీకారం చుట్టింది.. ఎంజీబీఎస్ లో నేడు జ‌రిగిన ఒక కార్య‌క్రమంలో జీవా వాటర్ బాటిల్స్‌ను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ లు విడుద‌ల చేశారు.. ఈ సంద‌ర్భంగా మంత్రి అజ‌య్ కుమార్ మాట్లాడుతూ, ప్రతేడాది 90లక్షల నీటిని టీఎస్ ఆర్టీసీ బయటనుంచి కొటుందని తెలిపారు. ఇక నుంచి సొంతంగా తయారు చేసుకున్న జీవానే వాడుతామన్నారు. జీవా వాటర్ వల్ల ఆర్టీసీకి కొంత ఆదాయం వచ్చే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. ప్రస్తుతం లీటర్ బాటిళ్ళు అందుబాటులో ఉంటాయని, త్వరలో 250 ఎంఎల్‌, అర లీటర్‌ బాటిళ్ల ఉత్పత్తి ప్రారంభిస్తామన్నారు. కేంద్రం డీజిల్ ధరలు పెంచడం వల్ల ఆర్టీసీపై మోయలేని భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు . ప్రతిరోజూ రూ. 2కోట్లకు పైగా ధ‌ర‌ల పెంపు వ‌ల్ల భారం ప‌డుతున్న‌ద‌ని చెప్పారు.. ఆర్టీసీ ప్రైవేటీకరణ చేసినట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. ప్రస్తుతం ఉన్న 97 డిపోలు ఆర్టీసీ ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయని పువ్వాడ అజయ్ స్పష్టం చేశారు. సజ్జనార్ ఆధ్వర్యంలో 27 డిపోలు లాభాల్లో నడుస్తున్నాయన్నారు. ఆర్టీసీని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేసే ప్రసక్తే లేదంటూ.. త్వరలోనే మరిన్ని కొత్త బస్సులను అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement