గ్రూప్-1 మెయిన్స్‌లో నో చేంజెస్
పాత పద్ధతిలోనే పరీక్షలుంటాయి
స్పష్టత ఇచ్చిన టీస్‌పీఎస్‌సీ
అభ్యర్థుల ఆందోళన లెక్కచేలేదు
అక్టోబర్ 21 నుంచి మెయిన్స్ పరీక్షలు
వివరాలు వెల్లడించిన కమిషన్
గ్రూప్-1 మెయిన్స్‌పై టీఎస్‌పీఎస్సీ గురువారం స్పష్టత ఇచ్చింది. ఎంపికలో ఎలాంటి మార్పు లేదని తేల్చి చెప్పేసింది. గ్రూపు-1లో మెయిన్స్‌కు 1:100 ప్రాతిపదికన ఎంపిక చేయాలని అభ్యర్థులు కొన్నిరోజులుగా డిమాండ్ చేస్తున్నారు. ఈ ఆందోళనను టీఎస్‌పీఎస్సీ లెక్కలోకి తీసుకోలేదు. అంతేకాకుండా ఎలాంటి మార్పులు లేకుండా పాత పద్ధతికే ఓకే చెబుతూ పరీక్షలుంటాయని కమిషన్ ప్రకటించింది.
1:50 నిష్పత్తిలోనే ఎంపిక..
మెయిన్స్‌కు 1:50 నిష్పత్తిలోనే అభ్యర్థులను ఎంపిక చేస్తామని టీఎస్‌పీఎస్సీ ప్రకటించిది. ఈ నెల 5న టీస్‌పీఎస్సీ ముట్టడికి నిరసనకారులు పిలుపు ఇచ్చిన నేపథ్యంలో ఈరోజు ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
నోటిఫికేషన్ వివరాలు…
గ్రూప్-1 కొత్త నోటిఫికేషన్‌ను ఫిబ్రవరి 19న టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది. 563 పోస్టులతో గ్రూప్-1 కొత్త నోటిఫికేషన్‌ను ప్రకటించింది. ఈ పోస్టులకు జూన్ 9న పిలిమ్స్ పరీక్ష నిర్వహించింది. త్వరలోనే ఈ ఫలితాలు వెలువనున్నాయి. ఇక అక్టోబర్ 21 నుంచి 27 వరకు మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. ఇందులో మొత్తం 7 పేపర్లు ఉండనున్నాయి. ఇంగ్లిష్ క్వాలిఫయింగ్ పేపర్ కావడంతో పదో తరగతి స్టాండర్డ్‌లో నిర్వహించనున్నారు. ఈ మార్కులను మెయిన్స్ మొత్తం మార్కులలో కలుపరు.
గ్రూప్-1 మెయిన్స్ షెడ్యూల్..
గ్రూప్-1 మెయిన్స్ లో ఆరు పేపర్లు ఉంటాయి. ప్రతి పేపర్ కు 3 గంటల వ్యవధి, కాగా 150 మార్కుల పేపరు ఉంటుంది. మెయిన్ పరీక్షలను రోజూ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు నిర్వహిస్తారు.