హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో: జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీ-ఎస్పీఎస్సీ) పేపర్ లీకేజీ కేసు కొత్త మలుపు తిరుగుతోంది. లీకేజీలో కమిషన్ కాన్ఫిడెన్షియల్ విభాగం ఇన్చార్జ్గా ఉన్న శంకర్ లక్ష్మి పాత్రపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ పేపర్ లీకేజీ అంశంలో ఆమె ప్రమేయం ఉన్నట్లు-గా నిర్ధారణకు వచ్చిన సిట్ ఒకటి, రెండు రోజుల్లో ఆమెను కూడా అరెస్ట్ చేయవచ్చన్న ప్రచారం జరుగుతోంది. శంకర లక్ష్మి వ్యవహారంలో సిట్ అధికారులు కీలక సమాచారంతో పాటు- కాల్ డేటా వివరాలను సేకరించినట్టు- అత్యంత విశ్వసనీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే లీకేజీలో ఆమె పాత్ర ఉండొచ్చని చెబుతున్నారు.
2017 నుంచి టీ-ఎస్పీఎస్సీలో శంకర లక్ష్మి విధులు నిర్వర్తిస్తున్నారు. డీఏఓ, ఏఈఈ, ఏఈ పోస్టుల భర్తీకి నిర్వహించిన ఎంపిక పరీక్ష పేపర్ల అంశంలో ఆమె టీ-ఎస్పీఎస్సీ వివరాలను దాచిపెట్టినట్లు- సిట్ అనుమానిస్తోంది. పేపర్ లీకేజీలో శంకర లక్ష్మి సిట్‌కు ఒక విధమైన వాంగ్మూలం, ఈడీకి మరో విధంగా చెప్పినట్టు- సమాచారం. కేసు దర్యాప్తులో ఇప్పటివరకు సిట్‌కు టీ-ఎస్పీఎస్సీ ఇచ్చిన సమాచారంలో తేడాలు ఉన్నట్లు- సిట్ తేల్చింది. అలాగే.. పేపర్లు వాల్యుయేషన్ చేయలేదని కూడా టీ-ఎస్సీఎస్సీ తప్పుడు వివరాలు ఇవ్వడంతో.. ఆ సంస్థపై సిట్ అధికారులు సీరియస్ అయ్యారు. నోటీ-సులు ఇచ్చిన తర్వాత కూడా సరైన సమాచారం ఇవ్వకపోవడంతో టీ-ఎస్పీఎస్పై సిట్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే.. దర్యాప్తునకు సహకరించకపోతే, తీవ్ర పరిణామాలు తప్పవని సిట్ ఆ సంస్థకు హెచ్చరికలు జారీ చేసినట్టు- సమాచారం.
కాగా లీకేజీ కేసులో సిట్ ఇప్పటి వరకు 35 మందిని అరెస్ట్ చేయగా తాజా పరిణామాల నేపథ్యంలో ఈ సంఖ్య కాస్తా 50 వరకు చేరే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. డీఏఓ పరీక్షలో అత్యధిక మార్కులు, ర్యాంకులు సాధించిన అభ్యర్థుల వివరాలను సేకరించే పనిలో సిట్ ఉన్నటు- సమాచారం. డీఏఓ ప్రశ్నపత్రం పెద్ద ఎత్తున విక్రయించి సొమ్ము చేసుకున్నట్టు- సిట్‌కు కీలక సమాచారం అందింది. డీఏఓ పరీక్షలో కీలక నిందితుడు రాజేశ్వర్‌కు ఫస్ట్ ర్యాంక్, ఆయన భార్య శాంతికి రెండో ర్యాంక్, మరో నిందితురాలు రేణుక స్నేహితుడు రాహుల్ కుమార్ మూడో ర్యాంక్ సాధించారు. ఈ దిశగా లోతుగా దర్యాప్తు చేసిన సిట్ అధికారులు కీలక అంశాలు వెలుగు చూసినట్టు- చెబుతున్నారు.
ఓ వైపు సిట్ దర్యాప్తు కొనసాగుతుండగానే.. తీగ లాగితే డొంక కదిలినట్టు-… భారీ మొత్తంలో మనీలాండరింగ్ జరిగినట్టు- అధికారులు గుర్తించారు. ఇదే నేపథ్యంలో ఇటీ-వల టీ-ఎస్పీఎస్సీ ఛైర్మన్‌ని, సెక్రటరీని ఈడీ ప్రశ్నించింది. జనార్ధన్‌రెడ్డి, అనితా రామచంద్రన్ స్టేట్మెంట్స్ని ఇటీ-వల రికార్డ్ చేసింది. మొత్తం రూ.31 లక్షల లావాదేవీలు జరిగినట్టు- సిట్ గుర్తించింది. ఇదే నేపథ్యంలో కేసులో కీలక నిందితుడు ప్రవీణ్ దగ్గరనుంచి ఇంకా ఎవరెవరు ప్రశ్నాపత్రాలు కొన్నారనే దానిపై దర్యాప్తు కొనసాగుతోంది.