Tuesday, November 26, 2024

ప్ర‌శ్నా ప‌త్రాల లీకేజ్ – ఈడీ ముందు హాజ‌రైన TSPSC ఛైర్మ‌న్, కార్య‌ద‌ర్శి

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TSPSC) ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో సిట్ దర్యాప్తు ఆధారంగా నగదు అక్రమ చలామణి కోణంలోనూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణ జరుపుతున్నది.. దీనిలో భాగంగా ఈ కేసులో ఇప్ప‌టికే అరెస్ట్ అయిన నిందితుల వాంగ్మూలాలను చంచల్ గూడ జైలులో ఈడీ అధికారులు నమోదు చేసుకున్నారు. ఇక తాజాగా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ ఛైర్మన్ జనార్దన్ రెడ్డి, కార్యదర్శి అనిత రామచంద్రన్ ను కూడా ఈడీ ప్రశ్నించింది.. ఈ ఇద్ద‌రూ విచార‌ణ‌కు నేడు ఈడీ ఎదుట హాజ‌రయ్యారు.. వారి నుంచి న‌గ‌దు లావాదేవీ వివ‌రాల‌ను ఈడీ అధికారులు నమోదు చేసుకున్నారు. టీఎస్పీఎస్సీ ప్రశ్న పత్రాల లీకేజీలో ఇప్పటివరకు రూ.38 లక్షల లావాదేవీలు సిట్ గుర్తించింది. దీంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వాటిపై విచారణ కొనసాగిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement