Thursday, November 21, 2024

టీఎస్‌పీఎస్సీ ప్ర‌శ్న‌ప‌త్రాల లీకేజీ – హైకోర్టు విచార‌ణ జూన్ 5కి వాయిదా

హైద‌రాబాద్ : టీఎస్‌పీఎస్సీ ప్ర‌శ్న‌ప‌త్రాల లీకేజీ వ్య‌వ‌హారంలో ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం(సిట్‌) విచార‌ణ‌ను జూన్ అయిదో తేదికి వాయిదా వేసింది హైకోర్టు ..ఈ కేసుల‌ను సీబీఐకి అప్ప‌గించాల‌ని ఎన్ఎస్‌యూఐ నాయ‌కుడు బ‌ల్మూరి వెంక‌ట్ దాఖ‌లు చేసిన పిటిష‌న్‌పై విచార‌ణ కొన‌సాగిస్తున్న హైకోర్టు ప్ర‌స్తుతం సిట్ దర్యాప్తు కొసాగుతోందని, ఇలాంటి స‌మ‌యంలో తాము జోక్యం చేసుకోలేమ‌ని కోర్టు స్పష్టం చేసింది. సిట్ ద‌ర్యాప్తులో పురోగతి ఉంద‌ని అభిప్రాయ‌ప‌డిన కోర్టు విచార‌ణ‌ను ఎప్ప‌టి వ‌ర‌కు పూర్తి చేస్తారో చెప్పాల‌ని హైకోర్టు సిట్‌ను అడిగింది. సీఎఫ్ఎల్‌(సెంట్ర‌ల్ ఫోరెన్సిక్ ల్యాబోరేట‌రీ) నివేదిక రాగానే విచార‌ణ పూర్తి చేస్తామ‌ని అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్ ప్ర‌సాద్ కోర్టుకు విన్న‌వించారు. ఈ సంద‌ర్బంగానే అవుట్ స్సోర్సింగ్ ఉద్యోగుల‌ను విచారించారా అంటూ సిట్ ను ప్ర‌శ్నించింది… ఆ ప్ర్ర‌కియ కొన‌సాగుతున్న‌ద‌ని న్యాయ‌వాది కోర్టు దృష్టికి తెచ్చారు.. అలాగు టీఎస్‌పీఎస్సీ ప్ర‌శ్న‌ప‌త్రాల లీకేజీ వ్య‌వ‌హారంపై ద‌ర్యాప్తు పురోగ‌తిలో ఉంద‌ని అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్ ప్ర‌సాద్, సిట్ ఏసీపీ న‌ర్సింగ్ రావు వివ‌ర‌ణ ఇవ్వ‌డంతో హైకోర్టు సంతృప్తి వ్య‌క్తం చేస్తూ విచార‌ణ‌ను వేస‌వి సెల‌వుల అనంత‌రం జూన్ అయిదో తేదిన తిరిగి విచార‌ణ కొన‌సాగిస్తామంటూ పేర్కొంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement