Monday, November 25, 2024

వివిధ ఉద్యోగ పరీక్షల తేదీలను ప్రకటించిన టిఎస్పీఎస్సీ

హైదరాబాద్ – టిఎస్పీఎస్సీలో మునెపెన్నడూ లేని విధంగా పేపర్ లీకేజీ వ్యవహారం వెలుగు చూసిన విషయం తెలిసిందే. దీనిపై తెలంగాణ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయగా.. దాని దర్యాప్తులో విస్తుగొలిపే విషయాలు బయటకు వచ్చాయి. . టీఎస్పీఎస్సీ నిర్వహించాల్సిన పరీక్షలు అన్నీ వాయిదా పడుతూ వస్తున్నాయి. మార్చి 05న నిర్వహించిన పరీక్ష చివరిది కాగా.. మార్చి 12న నిర్వహించాల్సిన టీపీబీఓ(TPBO) పరీక్షను కూడా వాయిదా వేశారు. అయితే రద్దైన పరీక్షలు 4 ఉండగా.. వాటిలో మూడు పరీక్షలకు కొత్త తేదీలను ప్రకటించారు. డీఏఓ పరీక్షకు సంబంధించి మాత్రం కొత్త తేదీలు ఖరారు కాలేదు. ఇక ఇప్పటికే చాలా వరకు నోటిఫికేషన్లకు సంబంధించి పరీక్షల తేదీలను రీషెడ్యూల్ చేశారు. తాాజాగా రీషెడ్యూల్ చేసిన రెండు పరీక్షలకు సంబంధించి పరీక్ష తేదీలను మరోసారి మర్చారు. వాటి పరీక్షల తేదీలను సెప్టెంబర్ లో నిర్వహిస్తామని పేర్కొన్నారు. దానిలో

1. గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్స్.వీటికి మే 13న పరీక్ష నిర్వహించనున్నట్లు ఇటీవల టీఎస్పీఎస్సీ ప్రకటించింది. దీనిని తాజాగా ప్రకటించిన వెబ్ నోట్ లో వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. సెప్టెంబర్ 4 నుంచి 8 వరకు ఈ పరీక్షలను నిర్వహించనున్నారు.

2. ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు.ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు టెక్నికల్ అండ్ ఇంటర్మీడియట్ విద్యాశాఖలో ఖాళీగా ఉన్నాయి. మే 17న వీటికి సంబంధించి పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించగా.. తాజాగా దీనిని వాయిదా వేశారు. తాజాగా టీఎస్పీఎస్సీ విడుదల చేసిన వెబ్ నోట్ లో దీనిని సెప్టెంబర్ 11కు రీషెడ్యూల్ చేసినట్లు పేర్కొన్నారు

టీఎస్పీఎస్సీ విడుదల చేసిన నోటిఫికేషన్లు కొత్త పరీక్షల తేదీలు

గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్స్ సెప్టెంబర్ 4-8

- Advertisement -

అగ్రికల్చర్ ఆఫీసర్ మే 16

ఫిజికల్ డైరెక్టర్ సెప్టెంబర్ 11

లైబ్రైరియన్ పోస్టులు మే 17

అసిస్టెంట్ ఎగ్జిక్యూట్ ఇంజనీర్ మే 08, మే 09, మే 21

డ్రగ్స్ ఇన్ స్పెక్టర్ పోస్టులు మే 19

గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష జూన్ 11

హార్టికల్చర్ ఆఫీసర్ ఉద్యోగాలు జూన్ 17

ఏఎంవీఐ జూన్ 26గ్రూప్ 4 పరీక్ష జులై 01

గ్రౌండ్ వాటర్ డిపార్ట్ మెంట్ (గెజిటెడ్ – నాన్ గెజిటెడ్) జులై 18, 19, 21

గ్రూప్ 2 పరీక్ష.. ఆగస్టు 29, 30

ఇక ఇప్పటికే ప్రకటించిన పరీక్షల తేదీలు ఇలా ఉన్నాయి

.1. అసిస్టెంట్ ఎగ్జిక్యూట్ ఇంజనీర్ఏఈఈ పరీక్షల తేదీలను కూడా ఇటీవల టీఎస్పీఎస్సీ అనౌన్స్ చేసింది. ఈ పరీక్షలను మే 08, మే09, మే 21వ తేదీన నిర్వహించనున్నారు. వీటికి హాల్ టికెట్స్ కూడా విడుదల చేశారు. ఈ పరీక్ష నిర్వహిణలో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు.

2. అగ్రికల్చర్ ఆఫీసర్ఈ పోస్టులకు సంబంధించి పరీక్ష తేదీని మొదట ఏప్రిల్ 25న ప్రకటించగా.. తాజాగా దీనిని మే 16 నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

3. డ్రగ్స్ ఇన్ స్పెక్టర్ పోస్టులుడ్రగ్స్ ఇన్ స్పెక్టర్ పోస్టులకు సంబంధించి పరీక్ష తేదీని మొదట మే 07వ తేదీ ప్రకటించగా.. తాజాగా దీనిని మే 19న నిర్వహించనున్నట్లు ప్రకటించారు

.4. గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష..గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షను జూన్ 11, 2023న నిర్వహించనున్నట్లు ఇటీవల టీఎస్పీఎస్సీ ప్రకటించింది.

5. హార్టికల్చర్ ఆఫీసర్ ఉద్యోగాలుఈ ఉద్యోగాలకు సంబంధించి పరీక్షల షెడ్యూల్ కూడా మార్పులు చేశారు. మొదట ఏప్రిల్ 04 న నిర్వహించాల్సి ఉండగా.. దీనిని జూన్ 17కు వాయిదా వేశారు

.6. గ్రూప్ 4 పరీక్షగ్రూప్ 4 పరీక్షను ఆఫ్ లైన్ విధానంలోనే నిర్వహించనున్నారు. దీనికి దాదాపు 10లక్షల అప్లికేషన్స్ వచ్చాయి. జులై 01న ఈ పరీక్షను నిర్వహించనున్నారు. ఈ పరీక్ష షెడ్యూల్ లో కూడా ఎలాంటి మార్పు ఉండకపోవచ్చు

7. గ్రూప్ 2 పరీక్ష..తెలంగాణలో గ్రూప్ 2 ఉద్యోగాలకు సంబంధించి పరీక్ష తేదీలను టీఎస్పీఎస్సీ ఇటీవల ఖరారు చేసింది. ఆగస్టు 29, 30 తేదీల్లో ఈ పరీక్షలను నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఈ తేదీల్లో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చు. తెలంగాణలో గ్రూప్-2 దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 16 సాయంత్రం 5 గంటలకు ముగిసింది. మొత్తం 5,51,943 దరఖాస్తులు వచ్చినట్లు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటన విడుదల చేసింది.

8. గ్రౌండ్ వాటర్ డిపార్ట్ మెంట్గ్రౌండ్ వాటర్ బోర్డులో నాన్ గెజిటెడ్ ఉద్యోగాలకు జులై 21న పరీక్ష నిర్వహించనున్నారు. గెజిటెడ్ ఉద్యోగాలకు జులై 18, 19న పరీక్షలు నిర్వహించనున్నారు

.9. అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్ స్పెక్టర్ పోస్టులుAMVI పోస్టులకు మొదట ఏప్రిల్ 23న పరీక్ష తేదీని ప్రకటించగా.. దీనిని జూన్ 26కు వాయిదా వేశారు

Advertisement

తాజా వార్తలు

Advertisement