కామారెడ్డి, (ప్రభ న్యూస్) : అటవీ భూముల సంరక్షణ, పోడు వ్యవసాయం పై నవంబర్ 8 నుంచి డిసెంబర్ 8 వరకు గ్రామ సభలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమ వారం జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. బహత్ పల్లె ప్రకతి వనాలను మండల ప్రత్యేక అధికారులు పరిశీలించాలని సూచించారు. కొవిడ్ కేసులు ఇతర దేశాల్లో పెరుగుతున్నందున పద్దెని మిదేళ్లు నిండిన ప్రతి ఒక్కరు గ్రామాల్లో వ్యాక్సినేషన్ వేయించుకోవాలని కోరారు.
ఉపాధి హామీ పనులకు కూలీలు ఎక్కువ సంఖ్యలో హాజరయ్యే విధంగా అధికారులు చూడాలని పేర్కొన్నారు. ప్రజావాణిలో వచ్చిన సమస్యలను సంబంధిత శాఖ అధికారులు పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజావాణిలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, ఇంచార్జ్ అదనపు కలెక్టర్ వెంకట మాధవరావు, అధికారులు పాల్గొన్నారు.
ప్రజావాణికి 30 ఫిర్యాదులు…
జిల్లా సమీకత కార్యాలయాల సముదాయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 30 ఫిర్యాదులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. రెవిన్యూ 20, గ్రామపంచాయతీ 4, పోలీస్ శాఖ 3, సివిల్ సప్లై, గహ నిర్మాణ, సహకార శాఖలకు ఒకటి చొప్పున ఫిర్యాదులు వచ్చాయని పేర్కొన్నారు