Tuesday, November 26, 2024

TS – వాల్మీకి జీవితం ఆదర్శప్రాయం

మక్తల్, అక్టోబర్28(ప్రభన్యూస్)
రామాయణ గ్రంథం గ్రంథ సృష్టికర్త మహర్షి వాల్మీకి జీవితం అందరికీ ఆదర్శప్రాయం అనుసరణీయమని మక్తల్ మాజీ ఎంపీపీ అధ్యక్షులు,భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొండయ్య అన్నారు. వాల్మీకి జయంతి వేడుకలను శనివారం మక్తల్ పట్టణంలో వాల్మీకి బోయ సంఘాల ఐక్యకార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక శ్రీ పడమటి ఆంజనేయ స్వామి దేవాలయంలో వాల్మీకి మహర్షి పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించారు.దేవాలయం ఆవరణలో వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి పూజాకార్యక్రమాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా కొండయ్య మాట్లాడుతూ మహాగ్రంథం రామాయణం రచించిన ఆదికవివాల్మీకి మహర్షి జీవితంఅట్టడుగు జీవనం గడిపి దారి దోపిడీలకు పాల్పడి కుటుంబాన్ని పోషించిన వాల్మీకి నారద మహర్షి హితబోధ తో రామనామ జపం ద్వారా ఆయన చుట్టూ పుట్టలు పేరుకుపోవడం వల్ల అప్పటివరకు రత్నాకరుడు గా ఉన్న ఆయన వాల్మీకి గా మారడం జరిగిందన్నారు.రామాయణ గ్రంథం ద్వారా మానవ జీవన విధానం, మనుషుల మధ్య అనుబంధాలను తెలియజేయడమే కాకుండా లోక కళ్యాణం దేశం కోసం పాటుపడాలని తెలియజేసిన గొప్ప వ్యక్తి వాల్మీకిమహర్షి అని అన్నారు.వాల్మీకి గా మారిన తర్వాత రామాయణం మహా గ్రంధాన్ని రచించి సీతారాముల జీవిత చరిత్రను తెలియజేయడంతో పాటు మనిషి జీవన విధానాన్ని మనుషుల మధ్య అనుబంధాలను ఆ గ్రంథం ద్వారా అందరికీ తెలియజేశారని అన్నారు.సీతమ్మ తల్లిని తన కుటీరంలో ఉంచుకుని అక్కడే లవ కుశలు జన్మించారని అన్నారు. అలాంటి వాల్మీకి మహర్షి జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయం అనుసరణీయమని అన్నారు ప్రతి ఒక్కరూ వాల్మీకి మహర్షి ని ఆదర్శంగా తీసుకుని తమ జీవితంలో చెడు అలవాట్లను వదిలిపెట్టి మంచి పనులను చేస్తూ జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలని వారు కొండయ్య సూచించారు .వాల్మీకి జయంతి వేడుకలు వాల్మీకి బోయ వర్గానికి సంబంధించిన వేడుకలు కావని దేశం జరుపుకోవడం జరుగుతోందని అన్నారు. వాల్మీకి జీవితాన్ని స్పూర్తిగా తీసుకుని ఆయన వారసులుగా వాల్మీకి బోయలు మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వాల్మీకి బోయ సంఘాల ఐక్యకార్యాచరణ కమిటీ నాయకులు బోయ రవికుమార్,బి .ఆంజనేయులు సూర్య , బి.శ్రీనివాసులు ,బి.గోపాలం,చిన్న వెంకటేష్,కత్తెపల్లి రాములు,బోయ వెంకటేష్,బి.కృష్ణ, బోయ నర్సిమ ,పెద్ద బోయ శ్యామయ్య ,బోయ కురుమయ్య ,పెద్దబోయ చిన్న కుర్మయ్య,కార్తీక్,మాగనూరు నరసింహ, వెంకటేష్, రాము,శంకర్ ,కర్ని శ్రీనివాస్, విశ్వబ్రహ్మణ సంఘం నాయకులు సి వి. ఆంజనేయులు ,బిఆర్ఎస్ నాయకులు కావలి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement