భారత రాష్ట్ర సమితి రాజ్యసభ అభ్యర్థిగా వద్దిరాజు రవిచంద్ర అభ్యర్థిత్వాన్ని పార్టీ అధినేత కెసిఆర్ ఖరారు చేశారు. అభ్యర్థిత్వం ఖరారైన నేపథ్యంలో ఆయన గురువారం అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. వరుసగా రెండోసారి రాజ్యసభ అవకాశం కల్పించారు. మొదటి దఫాలో వద్దిరాజు రవిచంద్ర 20 నెలల పాటు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి) ప్రముఖ వ్యాపారవేత్త.
తొలిసారి ఆగస్టు 22 మే 2018న బీఆర్‌ఎస్ (టీఆర్‌ఎస్) రాజ్యసభ సభ్యుడిగా ఖరారు చేసింది. వద్దిరాజు రవిచంద్ర పార్లమెంటులో రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు కార్యాలయంలో మే 30న రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణం స్వీకారం చేశారు. ప్రస్తుతం పదవీకాలం ఏప్రిల్ 2న ముగియనున్నది. ఈ క్రమంలో ఇటీవల రాజ్యసభ సభ్యుల ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడనున్న విషయం తెలిసిందే. నామినేషన్లు ఇప్పటికే ప్రారంభమైంది. రేపటితో గడువు ముగియనున్నది. ఈ నెల 27న రాజ్యసభ ఎన్నికలకు పోలింగ్ జరుగనున్నది.