మేడిగడ్డ – కాళేశ్వరం లాంటి కుంభకోణం ప్రపంచంలో మరొకటి ఉండదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్సార్ ప్రారంభించిన ప్రాజెక్ట్ ను మార్చి కాళేశ్వరం పేరుతో లక్షల కోట్లు దండుకున్నారని ఆరోపించారు.. కేసీఆర్ చేసిన పనులు చూసి తుగ్లక్ కూడా సిగ్గుపడుతారని అన్నారు. 14 టీఎంసీల నీటిని నిల్వ చేసి ఎన్నికల్లో ప్రజలను తప్పుదోవ పట్టించారని మంత్రి అన్నారు. ప్రాజెక్ట్ డ్యామేజ్ పై కేసీఆర్ ఇంతవరకు మాట్లాడలేదన్నారు.
నాలుగేళ్లుగా ప్రాజెక్ట్‌ల గురించి గత ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. బ్యారేజ్ లో కొన్ని నీళ్లు ఉంటేనే 18 వ పిల్లర్ నుంచి నీళ్లు ఉబికి వస్తున్నాయన్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా నిర్మాణంలో లోపం ఉందని నివేదిక ఇచ్చిందన్నారు. మేడిగడ్డ ప్రాజెక్ట్ విషయంలో గత ప్రభుత్వం చేసిన అక్రమాలను విచారణ జరిపిస్తామన్నారు. గత ప్రభుత్వంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పనితీరులో వైఫల్యం చెందిందన్నారు. బాధ్యులందరిపైనా చర్యలు చేపడతామని ఆయన తేల్చి చెప్పారు..