Friday, November 22, 2024

TS – రైతు బంధు, రైతు బీమాలో భారీ కుంభకోణం – ఇద్దరి అరెస్ట్ ..

హైదరాబాద్ – రాష్ట్రంలో సంచలనం సృష్టించిన రైతు బంధు, రైతు బీమా కుంభకోణం కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వ్యవసాయ విస్తరణాధికారి శ్రీశైలం సహా క్యాబ్ డ్రైవర్ ఓదెల వీరాస్వామిని అదుపులోకి తీసుకున్నారు. నకిలీ పత్రాలతో రైతుబంధు రైతుబంధు బీమా పథకాలను కాజేస్తున్నారనే రంగారెడ్డి జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ ఫిర్యాదుతో రంగంలోకి దిగారు పోలీసులు. రైతుబంధు, రైతు బీమా పథకం డబ్బులు కొట్టేస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. గత కొన్ని ఏళ్ల నుంచి రైతుబంధు బీమా డబ్బులను డ్రా చేసిన తమ సొంతపనులకు వాడుకుంటున్నట్లు వెలుగులోకి రావడంతో అధికారులు షాక్ తిన్నారు. నకిలీ పత్రాలు సృష్టించి నకిలీ వ్యక్తుల పేర్లతో డబ్బులు తీసుకుంటున్నట్లు గుర్తించారు పోలీసులు. భూములు లేకపోయినా ఉన్నట్లుగా సృష్టించి రైతుబంధు బీమా పథకాలు డబ్బులను ముఠా తీసుకుంటున్నట్లు తెలిపారు. వీరిని చాక చక్యంగా పట్టుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

దీనిపై సైబరాబాద్ సీపి అవినాష్ మహంతి మాట్లాడుతూ.. రంగారెడ్డి జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ ఫిర్యాదుతో రైతుబంధు, రైతు బీమా పథకం డబ్బులు కొట్టేసినట్లు వెలుగులోకి వచ్చిందని అన్నారు. రంగారెడ్డి జిల్లా కుందుర్గ్ మండలంలో 20 రైతు భీమా క్లైయిమ్స్ జరిగాయని తెలిపారు. ఈ 20 క్లైయిమ్స్ అనుమామానాస్పదంగా ఉన్నట్లు ఏఓ గుర్తించడం జరిగిందని అన్నారు. ఈ 20 క్లైయిమ్స్ ద్వారా సుమారు కోటి రూపాయల ఎల్ఐసి అమౌంటు రైతు బీమా కింద డైవర్ట్ చేశారని తెలిపారు. సుమారు 130 నకిలీ పట్టాదారులను క్రియేట్ చేసి రైతు బందు స్కీంలో క్లెయిమ్ చేశారని అన్నారు. ఇందులో కొంత మంది అప్పటికే చనిపోయి ఉన్నారని సంచలన విషయాలు బయటపెట్టారు సీపీ. కొన్ని రోజుల తరువాత చనిపోయారని చెప్పి నగదు డైవర్ట్ చేశారని అన్నారు. కుందర్గ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారని అన్నారు. ఆ తరువాత సైబరాబాద్ ఎకానమిక్స్ వింగ్ దర్యాప్తు చేసిందన్నారు. ఏఈఓ గోరెటి శ్రీశైలంతో పాటు వీరస్వామి ఇద్దరిని అరెస్టు చేశామని అన్నారు.

డెత్ సర్టిఫికెట్ లో పైనా కింద ఒరిజనల్ ఉంటుంది, కాని మధ్యలో ఉండే పేర్లు, ఇతర వివరాలను ఏఈఓ శ్రీశైలం మార్ఫింగ్ చేశాడని అన్నారు. ఈ డబ్బుతో వ్యవసాయ భూమిని కొనుగోలు చేశాడని అన్నారు. తన బంధువులు, ఇతర కుటుంబ సభ్యులకు భూములు ఉన్నాయని తనకు లేకపోవడంతో ఇలా చేశానని శ్రీశైలం చెబుతున్నారని సీపీ అన్నారు. రైతు బంధును ఇతనే తీసుకునేవాడని క్లారిటీ ఇచ్చారు. ఆ రైతులకు మాత్రం ఏదో ఒక సాకు చెప్పేవాడని తెలిపారు. ఫీల్డ్ వెరిఫికేషన్ ఎల్ఐసీ చేయలేదని, ప్రభుత్వ అధికారి కావడంతో వాళ్ళకి ఎలాంటి అనుమానం రాలేదని అన్నారు. వీరసామితో ఏడు అకౌంట్ లు జాతీయ బ్యాంకులలో అకౌంట్ లు క్రియేట్ చేశాడని, ఏటీఏం, బ్యాంకు పాస్ బుక్ లను తన దగ్గరే పెట్టుకున్నాడని అన్నారు. కొనుగోలు చేసిన భూములను ఏసీబీకి అప్పగిస్తామని సీపీ క్లారిటీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement