Friday, November 22, 2024

TS: యుద్దాన్ని తలపించిన ఎన్నిక.. కష్టపడ్డా కలిసిరాని ఫలితం..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: టీఆర్‌ఎస్‌లో ట్రబుల్‌ షూటర్‌గా ముద్రపడ్డ మంత్రి హరీష్‌రావుకు ట్రబుల్స్‌ ఎదురవు తున్నాయి. గత నాలుగు మాసాలుగా హుజూరాబాద్‌ విజయం కోసం అనను కూల వాతావరణంలో ఎంత కష్టపడ్డా.. చివరకు పార్టీకి విజయాన్ని అందించలేక పోయారు. ఎలాంటి క్షేత్రంలోనైనా ఒంటిచేత్తో విజయాలు అందించిన లీడర్‌గా పేరున్న హరీష్‌రావు గత ఏడాది దుబ్బాక, ఇపుడు హుజూరాబాద్‌ చేదు అనుభవం మిగిల్చాయి. తీవ్రంగా నిద్రాహారాలు మాని వందలు, వేల గంటలు శ్రమించినా చివరకు ఫలితం రాకపోయేసరికి పార్టీ క్యాడర్‌ కొంత నైరాశ్యానికి గురైం ది. గత ఏడాది జరిగినా దుబ్బాక నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రచారానికి హాజరుకాకపోగా, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కూడా ఆ దిక్కుగా వెళ్ళలేదు.

స్వల్ప తేడాతో పార్టీ పరాజయం పాలైంది. హుజూరాబాద్‌ విషయంలో అధిష్టానం అన్ని రకాలుగా అండదండలు అందించినా, శక్తికి మించి సహకారాన్ని అందించిన క్షేత్రస్థాయిలో మార్పు తీసుకురావడంలో సక్సెస్‌ కాలేకపోయారు. క్లిష్ట పరిస్థితుల్లో పార్టీని ఆదుకుంటూ, తన రాజకీయ చతురతతో టీఆర్‌ఎస్‌ విజయంలో కీలకపాత్ర పోషిస్తూ వస్తున్న హరీష్‌రావు ప్రయత్నాలు కూడా ఇటీవల కాలంలో ఫలించడం లేదు. గతంలో అంతా తానై పార్టీని తన భుజస్కందాలపై ఉంచుకుని నడిపించిన హరీష్‌రావుకు ట్రబుల్‌ షూటర్‌ అని పేరుంది. అయితే ఇంతటి రాజకీయ చతురత ఉన్న హరీష్‌రావు.. హుజురాబాద్‌ విషయంలో మాత్రం వెనకబడ్డారు. ఐతే హుజురాబాద్‌ ఉప ఎన్నికలు యుద్ధాన్ని తలపించాయి.

ఈ ఎన్నికల్లో పోటీ ప్రధానంగా టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్యే సాగింది. హరీష్‌ ప్రచారం, క్షేత్రస్థాయిలో పడ్డ అలుపెరుగని శ్రమ వల్లే టీఆర్‌ఎస్‌ ఢీ అంటే ఢీ అనే స్థాయికి చేరిందని మరికొందరు విశ్లేషిస్తున్నారు. హుజురాబాద్‌లో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్‌ వివిధ ప్రయత్నాలు చేశారు. ఎన్నడూ లేనివిధంగా ఓటర్లపై వరాల జల్లు కురిపించా రు. ఆఖరికి హుజురాబాద్‌లో దళిత బంధు పథకాన్ని పైలట్‌ ప్రాజెక్టుగా కూడా వర్తింపజేశారు. అయినా ఎన్నికల ఫలితాల్లో మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement