Tuesday, November 26, 2024

TS: రేప‌టి లోగా మొదటి డోసు పూర్తి చేయాలన్న‌ క‌లెక్ట‌ర్..

నిజామాబాద్‌ అర్బన్ :(ప్రభ న్యూస్‌) :అధికారులు, సిబ్బంది లక్ష్యానికి అనుగుణంగా వ్యాక్సి నేషన్‌ ప్రక్రియ పూర్తిచేయాలని, సరైన సమాచారమే నవెూదు చేయాలని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌ నుండి వీడియో కాన్ఫరెన్స్లో వ్యాక్సినేషన్‌ పై ఎంపిడిఓలు, ఎంపిఓలు, మెడికల్‌ ఆఫీసర్లు, గ్రామ, మండల స్పెషల్‌ అధికారులతో సమీక్షించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో 18 సంవ త్సరాలు నిండిన వారు తప్పక వాక్సిన్‌ తీసుకోవాలని, ఒక్కరు కూడా మిగలవద్దు అందరికి మొదటి డోస్‌ నవంబర్‌ 3 వరకు పూర్తి కావాలి, జిల్లా యంత్రాంగం మొత్తం పనిచేస్తుంది కావున టార్గెట్‌ పూర్తి చెయ్యాలని, జిల్లాలో మొత్తం ఆశ వర్కర్లు సర్వే ప్రకారం 11 లక్షల11 వేల 206 మందికి గాను 9 లక్షల, 89 వేల 577 మొదటి డోస్‌ తీసుకున్నారని, ఇంకా 1 లక్ష, 21 వేల 626 మందికి వ్యాక్సిన్‌ వేయాల్సి ఉన్నదని, వీరికి ఈ నెల 3 వరకు పూర్తి చేయాలని అధికారులను ఆదే శించారు. అధికారులు అన్ని పనులు ప్రక్కన పెట్టి వ్యాక్సిన్‌ పై పనిచేయాలని సూచించారు.

ఫీల్డ్‌ లో ఉన్నదే ఆన్లైన్‌ లో ఉండాలని చాలా మందికి వ్యాక్సిన్‌ ఇచ్చినా కూడా డేటా నవెూదు చేయలేదని, కావున వెంటనే పూర్తి చెయ్యాలని అధికారులు ఆదేశించారు. వ్యాక్సిన్‌ తీసుకున్న వారి వివరాలు తప్పక కోవిన్‌ ఆప్‌ లో డేటా ఎంట్రీ కావాలన్నారు. ఎక్కడా కూడా తప్పుడు సమాచారం నవెూదు చేయవద్దన్నారు. ఎంపిడిఓలు, మున్సిపల్‌ కమీషనర్‌లు వ్యాక్సిన్‌ పై ప్రత్యేక శ్రద్ద పెట్టి ప్రతి ఒక్కరు టీం వర్క్‌ తో పనిచేస్తే 100 శాతం పూర్తి అవుతుందని, జిల్లాలో మున్సిపాలి టీలలో పెండింగ్‌ ఉన్నందున వెంటనే పూర్తి చెయ్యాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్‌ చిత్రా మిశ్రా, ట్రైనీ అసిస్టెంట్‌ కలెక్టర్‌ మకరంద్‌, డిఆర్‌డిఓ చందర్‌ నాయక, జిల్లా పరిషత్‌ సీఈఓ గోవింద్‌ నాయక, ఇంచార్జి డిఎంఅండ్‌ హెచ్‌ఓ సుదర్శన్‌ ,జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement