నిజామాబాద్ ప్రతినిధి (ప్రభన్యూస్) : నిజామాబాద్ అర్బన్ లో శతాధిక వృద్ధురాలు గోపిశెట్టి వెంకమ్మ(101) వయస్సు వయసు పైబడిన బాధ్యతగా తన ఓటుహక్కు వినియోగించుకున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాందేవాడ ప్రాంతంలో నివాసం ఉంటున్న వృద్ధురాలు గోపిశెట్టి వెంకమ్మ నలంద హై స్కూల్ పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. బంధువుల సహాయంతో పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఆమెను ఎన్నికల అధికారులు పోలింగ్ హాల్లోకి తీసుకెళ్లి ఓటు వేయించారు.
ఓటు వేయడం అందరి బాధ్యత
ఓటు అనేది అమూల్యమైనదని తప్పకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని గోపిశెట్టి వెంకమ్మ చెప్పారు. 1951- 1952 నుండి తాను ఓటుహక్కును వినియోగించుకుంటున్నానని తెలిపారు. ఇప్ప టికీ ఆరోగ్యంగా ఉన్న ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం ను భగవం తుడు కల్పించినం దుకు సంతో షం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు 15 మంది ప్రధాన మంత్రుల పాలన చూశానని తెలిపారు.