Tuesday, November 26, 2024

TS – ఇదేనా మాకు ఇచ్చే గౌరవం….? టిడిపి సీనియర్ నాయకులు కాంగ్రెస్ పై గరం గరం

భద్రాచలం (టౌన్) ఫిబ్రవరి18 (ప్రభ న్యూస్): నేడు భద్రాచలంలో జరుగుతున్నటువంటి సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ భద్రాచలం పాలకమండలి సమీక్ష సమావేశానికి, భద్రాచలం డివిజన్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులను అనుమతించకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆ పార్టీ సీనియర్ నాయకులు ఎస్కే అజీమ్,కంభంపాటి సురేష్, రాజారాం, రేపాక రాంబాబు.గత పది సంవత్సరాల్లో బిఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన పాలకమండలి సమావేశాల్లో తమకు వినతి పత్రాలకు సమర్పించే అవకాశం కల్పించారని, నేడు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో జరుగుతున్న తొలి పాలకమండలి సమావేశంలో తమను గేటు వద్ద నిలిపివేయడంపై ఇదేనా మిత్రపక్షం కు ఇచ్చే మర్యాదా…! అంటూ మండి పడ్డారు.

నేడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో తెలుగుదేశం పార్టీ కీలక పాత్ర పోషించిందని, అలాంటి మిత్రపక్షమైన తమను గేటు వద్ద నిలిపి అవమానించడం సరైనది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎజెండా త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు…..

Advertisement

తాజా వార్తలు

Advertisement