Sunday, November 17, 2024

TS – హైదరాబాద్ భాగ్యనగరిగా స్థిర పడాలి – విశాఖ శారదా పీఠాధిపతుల ఆకాంక్ష

హైదరాబాద్ మహా నగరం చార్మినార్ సమీపంలోని భాగ్యలక్ష్మీ దేవాలయంలో విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పీఠాధిపతులకు ఆలయ నిర్వాహకులు శశికళ స్వాగతం పలికారు. పీఠాధిపతులు స్వయంగా భాగ్యలక్ష్మికి కుంకుమార్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పీఠాధిపతులు మాట్లాడుతూ కులాలకు అతీతంగా హిందూ సమాజం అంతా కలిసి ఈ దేవాలయాన్ని రక్షించుకోవడం చాలా గొప్ప విషయం అని అన్నారు. అనేక పోరాటాలు, త్యాగాలు వలన ఈ రోజు భాగ్యలక్ష్మి ఆలయం మన కళ్ల ముందు కనబడుతోందని అన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఇంతగా అభివృద్ధి చెందడానికిభాగ్యలక్ష్మీ అనుగ్రహమే కారణమన్నారు. హిందూ సమాజం అంతా ఏకతాటిపైకి వచ్చి సనాతన ధర్మాన్ని, దేవాలయ వ్యవస్థను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. అందుకు తాము పూర్తి సహాయ సహకారాలు అందించడానికి విశాఖ శ్రీ శారదా పీఠం ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుందన్నారు. అనంతరం బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మను , కర్మన్ ఘాట్ ఆంజనేయ స్వామిని పీఠాధిపతులు దర్శించుకున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement