Wednesday, November 20, 2024

పదో తరగతి ఫలితాల విడుదల

తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు వెబ్‌ సైట్‌ లో టెన్త్ ఫలితాలు అందుబాటులో ఉంటాయి. bse.telangana.gov.inతో పాటు ప‌లు వెబ్‌సైట్ల‌లో ఫ‌లితాలు చూసుకోవ‌చ్చు. పరీక్ష ఫీజు చెల్లించిన 5,21,073 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్టు మంత్రి సబితా తెలిపారు. 2,10,647 మంది విద్యార్థులకు 10/10 జీపీఏ వచ్చిందన్నారు. ఇంటర్నల్ అసెస్మెంట్ మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఇచ్చినట్టు తెలిపారు.  మొత్తం 535 పాఠ‌శాల‌లు 10 జీపీఏ సాధించాయ‌ని చెప్పారు. ద్యార్థులు తమ మెమోలను ప్రధానోపాధ్యాయుల ద్వారా తీసుకోవచ్చని సూచించారు. విద్యార్థుల పాస్ మెమోల్లో ఏవైనా పొరపాట్లు తలెత్తితే ప్రధానోపాధ్యాయుల ద్వారా ఎస్ఎస్‌ఎస్సీ బోర్డుకు పంపితే వెంటనే సరిదిద్దుతామని తెలిపారు. ఉత్తీర్ణులైన విద్యార్థులు భవిష్యత్‌లో మంచి కోర్సులను ఎంపిక చేసుకొని తమ భవిష్యత్‌ను తీర్చిదిద్దుకోవాలని సూచించారు

కాగా,కరోనా విజృంభ‌ణ కార‌ణంగా ఈ ఏడాది కూడా పదో తరగతి పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసిన విష‌యం తెలిసిందే. విద్యార్థులకు కొన్ని నెల‌ల క్రితం వారి పాఠ‌శాల‌ల్లో నిర్వహించిన‌ ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌-1లో వచ్చిన మార్కులను పరిగణనలోకి తీసుకుని మార్కులు ఇచ్చారు. తుది మార్కులు కేటాయించి గ్రేడ్లను ఖరారు చేశారు. విద్యార్థులకు ఆయా సబ్జెక్టులలో వచ్చిన మార్కుల ఆధారంగా గ్రేడింగ్, గ్రేడ్‌ పాయింట్లు ఇచ్చారు. అన్ని సబ్జెక్టులకు కలిపి గ్రేడ్‌ పాయింట్‌ యావరేజ్ ను నిర్ణ‌యించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement