మంచిర్యాల, (ప్రభన్యూస్): రామగుండం కమీషనర్ ఆఫ్ పోలీస్ గా ఐపీఎస్-2006 వ బ్యాచ్ కు చెందిన ఎం.శ్రీనివాసులు (డీఐజీ)ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో రామగుండం కమీషనర్ గా పనిచేసిన రెమా రాజేశ్వరి (డీఐజీ) ఉమెన్ సేఫ్టీ వింగ్ కు బదిలీ కాగా ఆమె స్థానంలో డీఐజీ ఎల్.ఎస్. చౌహాన్ కు పోస్టింగ్ ఇచ్చారు.
- Advertisement -
ఆ ఉత్తర్వులను రద్దు చేస్తూ చౌహాన్ ను జోగులాంబ జోన్-7 డిప్యూటి ఇన్ స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గా కొనసాగిస్తున్నట్లు ఉతర్వులు వెలువరించారు. కాగా గత కొద్ది రోజులుగా రామగుండం పోలీస్ కమీషనర్ గా ఐజీ తరుణ్ జోషి ఇంచార్జిగా బాధ్యతలు నిర్వహించారు. డీఐజీ హోదా కలిగి ఉండి పోస్టింగ్ కోసం వెయిటింగ్ లో ఉన్న ఎం.శ్రీనివాసులును రామగుండం నూతన కమీషనర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.