హైదరాబాద్:ఫిబ్రవరి 21సింగరేణి సంస్థలో ఖాళీగా ఉన్న 317 డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులు, 168 ఇంటర్నల్ పోస్టులకు గురువారం నోటిఫికేషన్లు జారీ చేస్తున్నట్లు ఆ సంస్థ సీఅండ్ఎండీ ఎన్.బలరామ్ వెల్లడించారుసింగరేణి అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలపై ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు సింగరేణి ఛైర్మన్ , ఎండీ ఎన్.బలరామ్, డైరెక్టర్(పర్సనల్) ఎన్.వి.కె.శ్రీనివాస్‌లతో బుధవారం సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణిలో కారుణ్య నియామక ప్రక్రియను వేగంగా చేపట్టాలని, ఈ ఏడాదిలో కనీసం వెయ్యి మంది వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. ఉద్యోగాల నియామక ప్రక్రియ చాలా పారదర్శకంగా ఉండాలన్నారు. పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు జరిగినా ఉపేక్షించేది లేదన్నారు.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సింగరేణిలో ఖాళీగా ఉన్న 317 డైరెక్ట్, 168 ఇంటర్నల్ పోస్టులకు గురువారం నోటిఫికేషన్లు విడుదల చేస్తామన్నారు..