Friday, November 22, 2024

TS – సింగరేణి అభివృద్ధిలో అధికారులది కీలక పాత్ర – చైర్మన్ , ఎండి బలరామ్

సింగ‌రేణి భ‌వ‌న్‌, – సింగరేణి సంస్థ అభివృద్ధిలో కార్మికులతో పాటు అధికారులది అత్యంత కీలకమైన పాత్రని, సంస్థ స్థితిగతులను కార్మికులకు వివరిస్తూ సంస్థ పురోభివృద్ధికి మరింత అంకితభావంతో పని చేయాలని సింగరేణి సంస్థ చైర్మన్ మరియు ఎండి ఎన్.బలరామ్ అధికారులను కోరారు. హైదరాబాద్ సింగరేణి భవన్లో బుధవారం ఉదయం తనతో సమావేశమైన సింగరేణి వ్యాప్త అధికారుల సంఘం (కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) నాయకులతో ఆయన మాట్లాడారు.

నేటి పోటీ మార్కెట్లో సింగరేణి సంస్థ నిలదొక్కుకోవాలంటే ఉత్పాదకత మరింత పెరగాలని, దీనికోసం ప్రతి అధికారి, కార్మికుడు పూర్తి పని గంటలు సద్వినియోగం చేయాల్సిన అవసరం ఉందని, ముఖ్యంగా అధికారులు ఉద్యోగులను చైతన్య పరుస్తూ ముందుకు నడపాలన్నారు,

ఈ సందర్భంగా ఆయన కంపెనీ ఉత్పత్తి వ్యయం, బొగ్గు అమ్మకం, ప్రస్తుతం కంపెనీ ఎదుర్కొంటున్న ఆర్థిక పరిస్థితులు వంటివి కూలకషం గా వివరించారు. సంస్థను అభివృద్ధి పథంలో నడపాలంటే ఇంకా చేపట్టాల్సిన నిర్మాణాత్మక చర్యలు సూచించాలని ఆయన అధికారులు కోరారు. కంపెనీకి సంబంధించిన అన్ని విషయాలు ప్రతి కార్మికుడికి తెలియాలన్న ఉద్దేశంతో మల్టీ డిపార్ట్మెంట్ టీమ్ లను ఏర్పాటు చేసి ప్రతి గని కి పంపిస్తున్నామని, వీటిని మరింత విస్తృత పరచాల్సిన అవసరం ఉందన్నారు. కంపెనీని లాభదాయకంగా నడిపిస్తే కార్మికులతో పాటు అధికారులకు కూడా తగిన విధంగా ప్రోత్సాహకాలు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

- Advertisement -

అధికారుల సంఘం నూతన అధ్యక్షులు లక్ష్మీపతి గౌడ్, జనరల్ సెక్రెటరీ పెద్దినరసింహులు సారథ్యం లో 12ఏరియాలో అధికారుల సంఘం కమిటీల నాయకులు చైర్మన్ ను ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా లక్ష్మీపతి గౌడ్ మాట్లాడుతూ సింగరేణి సంస్థలో ముఖ్యమైన మూడు డైరెక్టర్ పోస్టులలో పని చేసిన అపార అనుభవంతోపాటు కార్మికులతో కలిసిపోయి వారి కష్టసుఖాలు ఎదిగిన వ్యక్తిగా ఉన్న ఎన్.బలరామ్ ను సంస్థ చైర్మన్ మరియు ఎండిగా రాష్ట్ర ప్రభుత్వం నియమించడం ఎంతో హర్షించదగిన విషయం అన్నారు. ఆయన సారథ్యంలో కంపెనీ మరెంతగానో అభివృద్ధి చెంది, దేశంలో అగ్రస్థానంలో నిలుస్తుందన్నారు

సంస్థ కోసం 24 గంటలు పని చేసే అధికారులకు కూడా తగిన ప్రోత్సాహం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అధికారులకు ఉచిత లాప్టాప్ లు అందజేయాలని, ఉన్నత చదువులు చదివే అధికారుల పిల్లలకు కార్మికులకు మాదిరిగానే ప్లీజ్ రియంబర్స్మెంట్ చేయాలని విజ్ఞప్తి చేయగా చైర్మన్ ఈ అంశాలపై పరిశీలించి తగునిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.

ఈ సమావేశంలో జనరల్ మేనేజర్ కోఆర్డినేషన్ ఎం.సురేష్ తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. సింగరేణి స్థాయి అధికారుల సంఘం ఉపాధ్యక్షులు పొనుగోటి శ్రీనివాస్, పి రాజీవ్ కుమార్, సహాయ కార్యదర్శులు ఆర్ కిరణ్ రాజ్ కుమార్, సిహెచ్ రాజగోపాల్, కోశాధికారి ఇ .నరేష్, సహాయ కార్యదర్శి బి.రాజగోపాల్ అన్ని ఏరియాలో సంఘం అధ్యక్ష కార్యదర్శులు నాయకులు పాల్గొన్నారు.-

Advertisement

తాజా వార్తలు

Advertisement