Tuesday, November 26, 2024

TS – సమ్మక్క సారక్క గిరిజ‌న వ‌ర్శిటీ ప్రారంభం…

ములుగులో తాత్కాలిక భ‌వ‌నాలు..
వ‌ర్శిటీ కోసం రూ 900 కేటాయింపు
ఈ విద్యా సంవ‌త్స‌రం నుంచే అడ్మిష‌న్లు
త్వ‌ర‌లో మోదీ చేతుల మీదుగా నిర్మాణాల‌కు భూమి పూజ
వెల్ల‌డించిన కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి

ములుగులో ఏర్పాటు చేసిన సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తాత్కాలిక భవనాన్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నేడు లాంచ‌నంగా ప్రారంభించారు.. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ఈ విద్యాసంవ‌త్స‌రం నుంచే ఈ విశ్వ‌విద్యాలంలో త‌ర‌గతులు ప్రారంభిస్తామ‌న్నారు. .సమ్మక్క సారక్క యూనివర్సిటికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నోడల్ గా ఉంటుంద‌న్నారు.. మహిళ దినోత్సవ సందర్బంగా సమ్మక్క సారలమ్మ జాతీయ గిరిజన వర్సిటీ ప్రారంభించుకోవ‌డం ఆనందంగా ఉంద‌న్నారు..

పూర్తి స్థాయిలో భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తే యూనివర్సిటీ శాశ్వత భవన నిర్మాణం చేపడుతామ‌న్నారు.. దీనికి ఎటువంటి నిధుల కొర‌త లేద‌న్నారు కిష‌న్ రెడ్డి . ఈ విశ్వ‌విద్యాల‌యం ఏర్పాటుకు రూ.900 కోట్లు కేటాయించిన విష‌యాన్ని గుర్తు చేశారు.. ఎన్నిక‌ల అనంత‌రం శాశ్వ‌త భ‌వ‌న నిర్మాణ‌లకు ప్ర‌ధాని మోదీ తో భూమి పూజ చేయిస్తామ‌ని చెప్పారు..
తెలంగాణలో 9.8 గిరిజన జనాభా శాతం ఉంద‌ని, అలాగే వారిలో 50 శాతం మంది నిర‌క్ష‌రాస్యుల‌ని వివ‌రించారు.. ట్రైబల్స్ లో అక్షర్యాసత్యను పెంచాల్సిన అవసరం ఉంద‌ని అన్నారు.

టూరిజం స్పాట్ ..
రామప్ప దేవాలయం ఈ ప్రాంతంలో ఉండడం ఎంతో గర్వకారణమ‌న్నారు.. యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని రూ.63 కోట్లతో అభివృద్ది చేస్తున్నామ‌ని చెప్పారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement