Sunday, September 8, 2024

TSRTC | 14 నుంచి కోటి దీపోత్సవం.. ప్ర‌త్యేక బ‌స్సులు న‌డ‌పనున్న టీఎస్ ఆర్టీసీ

హైద‌రాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వ‌హించ‌నున్న‌ కోటి దీపోత్సవానికి ప్రత్యేక బస్సులు న‌డ‌పాల‌ని ఆర్టీసీ గ్రేటర్‌ అధికారులు సోమవారం నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 14 నుంచి 27 వరకు ఈ కార్య‌క్ర‌మానికి హాజరుకానున్న భక్తుల కోసం ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. అయితే నగరంలో దాదాపు 18 ప్రాంతాలకు చెందిన డిపోల నుంచి ఎన్టీఆర్‌ స్టేడియం వరకు ప్రత్యేక బస్సులు నడుపుతామని ఆర్టీసీ గ్రేటర్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ వి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ ప్రత్యేక బస్సులు సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంట‌ల‌ వరకు నడుస్తాయన్నారు. బస్సులకు సంబంధించిన పూర్తి వివరాల కోసం కోటి బస్‌ స్టేషన్‌లో 9959226160, రేతిఫైల్‌ బస్‌ స్టేషన్‌లో 9959226154 ఫోన్‌ నంబర్లను సంప్రదించాలన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement