Monday, November 25, 2024

TS ఓల్డ్ సిటీకి న‌యా రూట్‌! మెట్రో పనులకు రేవంత్ శంకుస్థాపన

మెట్రో కోసం చ‌ర్య‌లు స్పీడ‌ప్‌
ఎంజీబీఎస్‌ నుంచి ఫలక్‌నుమా దాకా
5.5 కిలోమీటర్ల మేర విస్తరణ
సాలార్‌జంగ్‌ మ్యూజియం, చార్మినార్‌, శాలిబండ, షంషీర్‌ గంజ్‌, ఫలక్‌నుమా ప్రాంతాల్లో మెట్రోస్టేషన్లు
7న ఫలక్‌నుమాలో పనులకు సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: పాతబస్తీకి మెట్రో సేవల విస్తరణపై తెలంగాణ ప్రభుత్వ ఆదేశాలతో మెట్రో అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఎల్‌ అండ్‌ టీ, హెచ్‌ఎంఆర్‌ఎల్‌ అధికారులు ఎంజీబీఎస్‌-ఫలక్‌నుమా మధ్య మెట్రో రైలు కోసం ప్రణాళికలు సిద్ధం చేశారు. ఎంజీబీఎస్‌ నుంచి ఫలక్‌నుమా వరకు 5.5 కిలోమీటర్ల మేర పాతబస్తీ మెట్రో నిర్మాణం చేపట్టనున్నారు. ఈ మార్గంలో సాలార్‌జంగ్‌ మ్యూజియం, చార్మినార్‌, శాలిబండ, షంషీర్‌ గంజ్‌, ఫలక్‌నుమా ప్రాంతాల్లో మెట్రోస్టేషన్లు నిర్మిస్తారు. ఈ మార్గంలో 103 మతపరమైన నిర్మాణాలున్నాయని, మెట్రో విస్తరణలో భాగంగా వీటిని తొలగించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అయితే.. ఎక్కువగా కట్టడాలను కూల్చకుండా 80 అడుగుల మేర రోడ్డు విస్తరణ చేసి ఈ మార్గంలో మెట్రో పనులు ప్రారంభించాలని ప్రణాళికలు సిద్ధంచేశారు. ఈ మేర‌కు ప్లాన్‌రెడీ అయిన‌ట్టు తెలుస్తోంది.

రేవంత్ చేతుల మీదుగా శంకుస్థాపన

హైదరాబాద్‌ పాతబస్తీ మెట్రో రైలు పనులకు రంగం సిద్ధమైంది. ఈ నెల 7వ తేదీన ఫలక్‌నుమాలో సీఎం రేవంత్‌ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఎంజీబీఎస్‌ నుంచి ఫలక్‌నుమా వరకు మెట్రోరైలు పొడిగించేందుకు గతంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే.. భూసేకరణలో సమస్యలు తలెత్తడంతో ఆ ప్రక్రియను అప్పట్లో తాత్కాలికంగా నిలిపివేశారు. తాజాగా.. భూసేకరణ సమస్యలు పూర్తి చేసి మెట్రో విస్తరణ పనులు మొదలు పెట్టేందుకు హైదరాబాద్‌ మెట్రో రైల్‌ లిమిటెడ్ (హెచ్‌ఎంఆర్‌ఎల్‌) సిద్ధమైంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement