’మొసలి కన్నీరు కార్చి, ఏడిస్తే.. నాలుగు డైలాగులు కొడితే.. కడుపు నిండదు‘ అని మంత్రి హరీశ్‌రావు అన్నారు. గురువారం కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం మాడిపల్లిలో టీఆర్ ఎస్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు.
’’మేం చెప్పింది వినండి.. ఆలోచించండి. పెట్రోల్ చార్జిలు పెరగాలే, డిజీల్ పెరగాలే.. గ్యాస్ ధరలు పెరగాలే.. నిత్యావసర వస్తువుల ధరలు పెరగాలే.. అని ఈటల రాజేందర్ చెబుతున్నడు. టీఆర్ఎస్ ఎం చెబుతోంది. రూ.200 పెన్షన్ రూ.2,016కు సీఎం కేసీఆర్ పెంచిండు. కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా పేదింటి ఆడపిల్లకు లక్ష రూపాయలు ఇస్తున్నడు. ముందుగా కళ్యాణ లక్ష్మి ఎస్సీలతో ప్రారంభమైంది. తర్వాత అన్ని కులాలు, మతాలలో ఉన్న పేదలకు వర్తింపజేశారు. అలాగే దళితబంధు కూడా దళితులతో ప్రారంభమైంది. కళ్యాణ లక్ష్మి తరహాలోనే అన్ని కులాలకు సాయం అందుతుంది‘‘ అని హరీశ్ వివరించారు.
‘‘బీజేపీ రెచ్చగొట్టి ఓట్లు పొందాలని చూస్తోంది. మేం ఇచ్చేది ఇస్తున్నాం. బీజేపీ వాళ్లు మాత్రం ఏం ఇస్తరో ఎందుకు చెప్పడం లేదు. ఎందుకు ప్రజలను రెచ్చగొడుతున్నరు’’ అని మంత్రి హరీశ్ ప్రశ్నించారు. బీజేపీ గెలవనే గెలవదు. గెల్చనా మంత్రి అయియ్యేది ఉందా.. పనులు చేసేది ఉందా అని ఎద్దేవా చేశారు.
‘‘ఈ నెల 30 తర్వాత కూడా సీఎంగా కేసీఆర్ ఉంటరు. పనులన్నీ ఆయన చేస్తడు. ఎస్సీలకు దళిత బందు పడింది. ఇంకో 50 మందికో రాకపోవచ్చు. ఢిల్లీలో బీజేపీ కంప్లైంట్ ఇచ్చిండ్రు. 30వ తేదీ వరకు ఇవ్వవద్దు అని. కానీ, ఎన్ని రోజులు. 4వతేదీ తర్వాత మేం వస్తం. రానివాళ్లకు యూనిట్లు వచ్చేలా మేమే గ్రౌండ్ చేస్తాం. గెల్లు శ్రీను గెలిస్తే నేనే అధికారులతో వస్తా.. ఇక్కడ నిలబడి మీకు ఇచ్చిన ప్రతీ మాటా నెరవేరుస్తా. అని హరీశ్‌రావు హామీ ఇచ్చారు. దుబ్బాకలో 3,600 ఓట్లు పోయినయి. రోడ్డురోలర్, కోల పీఠలకు వేసిండ్రు. గందరగోళ పడవద్దు. కనపడక పోతే అడిగి మరీ కారు గుర్తుకే ఓటు వేయండి’’ అని ఓటర్లను అభ్యర్థించారు హరీశ్ రావు.