Wednesday, November 20, 2024

TS: పోలీస్ సార్ సల్లగుండాలి.. ఓ వృద్ధురాలి దీవెనార్తె.. ఎక్క‌డో తెలుసా!

Warangal: పోలీస్ సార్ సల్లగుండాలి అంటూ వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషిని చూస్తూ ఓ వృద్ధురాలు అన్న మాట‌లివి.. హుజూరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా కమలాపూర్ మండలంలో పోలింగ్ కేంద్రాలను వరంగల్ పోలీస్ కమిషనర్ శనివారం సందర్శించినప్పుడు చోటుచేసుకున్న సంఘటన ఇది. కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామానికి చెందిన వృద్ధురాలు ఈ రోజు ఓటు హక్కు వినియోగించుకోనేందుకు ఉప్పల్ గ్రామంలోని ఒక పోలింగ్ కేంద్రానికి వెళ్ళాల్సింది పోయి మరో పోలింగ్ కేంద్రానికి వచ్చింది. తీరా ఓటు వేసే సమయంలో తను ఓటు వేయాల్సింది ఈ కేంద్రంలో కాద‌ని ఎన్నికల‌ సిబ్బంది ఆమెకు తెలపడంతో… అస‌లే వృద్ధాప్యం. తాను న‌డ‌వ‌లేని స్థితిలో ఉన్నాన‌ని ఒక్కసారిగా నిస్సహాయస్థితిలో పోలింగ్ కేంద్రం ప్రధాన ద్వారంలో కూర్చుండిపోయింది.

అదే సమయంలో పోలీస్ కేంద్రాన్ని పరీశీలించేందుకు వచ్చిన పోలీస్ కమిషనర్ త‌రుణ్ జోషి.. ఆ వృద్ధురాలిని గమనించి ఆమె వ‌ద్ద‌కు వెళ్లి విషయం తెలుసుకున్నారు. తానే స్వయంగా తన వద్ద ఉన్న పోలింగ్ కేంద్రాల లిస్ట్‌లో ఆ వృద్ధురాలి పోల్ చిట్టీ అధారంగా ఓటు వినియోగించుకోవాల్సిన పోలింగ్ కేంద్రాన్ని గుర్తించి పోలీసుల సహయంతో ఆటో ఎక్కించి అక్క‌డికి పంపించారు. నడవలేని నన్ను పోలింగ్ కేంద్రానికి ఆటోలో పంపిస్తున్న పోలీస్ సార్ సల్లంగుండాలని ఆ వృద్దురాలు సీపీని దీవించిండంతో అంద‌రూ సంతోషం వ్య‌క్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement