Sunday, November 3, 2024

TS – మేడారానికి బ‌య‌లుదేరిన సమ్మక్క భర్త పగిడిద్దరాజు

ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసి గిరిజన జాతరైన సమ్మక్క-సారక్క జాతర రేప‌టి నుంచి ప్రారంభం కానుంది.. దీనిలోభాగంగా వన దేవతలు గద్దెలపై కొలువుధీరి భక్తులకు కోర్కెలను నెరవేర్చడానికి సమ్మక్క భర్త పగిడిద్దరాజు ను తన స్వగ్రామం మహబూబాబాద్ జిల్లా గంగారాం మండలం పూనుగొండ్ల గ్రామం లో ముస్తాబై బయలు దేరారు .

పగడిద్ద రాజు స్వామివారిని పడగ రూపంలో మేడారం కు తరలిస్తున్నారు. 20వ‌ పెనక వంశీయులు తమ పూర్వీకుల అచారం ప్రకారం పగిగిద్దరాజును పెల్లికొడుకుగా ముస్తాబు చేసి మేడారం కు అటవి మార్గంలో కాలి నడకన బయలుదేరి కర్లపెల్లి, గుండ్లవాగు ప్రాజెక్టు మీదుగా గోవింధరావుపేట మండలం లక్ష్మిపురం చేరుకుంటారు. నేటి రాత్రి అక్కడే బస చేసి మరుసటి రోజున రాత్రి స్వామివారిని మేడారంలోని గద్దెలపై ప్రతిష్టిస్తామని ఆలయ పూజారి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement