హైదరాబాద్ – జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశం రెండో రోజు వాడివేడిగా సాగుతోంది. ఇవాళ ఉదయం మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన బల్దియా సర్వసభ్య సమావేశం ప్రారంభమైన వెంటనే కౌన్సిల్ హల్ లో ఓయో రూమ్స్ రగడ మొదలైంది. ఓయో రూమ్స్ పై కార్పొరేటర్లు హాట్ హాట్ గా మాటల యుద్ధం జరిగింది. రెసిడెన్సీయల్ పేరుతో కమర్షియ ల్ నడిపిస్తున్నారని మండిపడ్డారు. ఫ్యామిలీస్ ఉన్న ప్రాంతాల్లో ఓయో బిసినెస్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెసిడెంట్స్ పేరుతో కమర్షల్ బిజినెస్ పేరుతో వ్యాపారం చేస్తుంటే అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఓయో రూమ్స్ నిబంధనల పై క్రాస్ చెక్ చెయ్యాలి కార్పొరేటర్లు డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా కౌన్సిలర్లు ప్రజా సమస్యలను సభలో లేవనెత్తారు. హైదరాబాద్‌లో కుక్కల బెడద తీవ్రంగా ఉందని కార్పొరేటర్లు అధికారులను నిలదీశారు. సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో స్పోట్స్ తక్కువగా ఉన్నాయని, ఫంక్షన్లు ఎక్కువగా ఉన్నాయని కార్పొరేటర్లు చెబుతున్నారు. కార్పొరేటర్లను అధికారులు పట్టించుకోవడం లేదని బీజేపీ కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేటర్ల పట్ల అధికారులు కుక్కల కంటే హీనంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కనీసం అధికారులు ఫోన్లు కూడా ఎత్తడం లేదని కార్పొరేటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు ఏం సమాధానం చెప్పాలని కార్పొరేటర్లు ప్రశ్నించారు.