నేటి రాత్రికి ఢిల్లీకి తరలింపు
హైదరాబాద్ – లిక్కర్ స్కామ్ కేసులో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేశారు. నేటి రాత్రి ఆమెను ఢిల్లీకి తరలించనున్నారు.. ఈ మేరకు సమాచారాన్ని ఈడీ అధికారులు కుటుంబ సభ్యులకు తెలిపారు.. అంతకు ముందు ఈడీ అధికారుల బృందం ముందుగా ఆమెకు సెర్చ్ వారంట్ జారీ చేశారు.. ఆ తర్వాత ఆమె ఇంటిలో సోదాలు నిర్వహించారు.. ఆరు గంటల సోదాల అనంతరం ఆమెను అరెస్ట్ చేసేందుకు వీలుగా ఆమెకు నోటీస్ అందజేశారు.. అనంతరం ఆమెను అరెస్ట్ చేశారు.. ఈ కేసులో ఆమెను మరింత లోతుగా విచారించేందుకు ఢిల్లీకి తీసుకెళ్లనున్నారు.. నేటి రాత్రి 8.45 ఢిల్లీ కి వెళ్లే విమానంతో కవితను తీసుకెళుతున్నట్లు కుటుంబ సభ్యులకు ఈడీ అధికారులు తెలిపారు.. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది..
కవిత ఇంటికి కెటిఆర్, హరీష్ రావు…
ఈడీ అధికారులు కవితను అరెస్ట్ చేశారన్న విషయం తెలుసుకున్న సోదరుడు కెటిఆర్, మాజీ మంత్రి హరీష్ రావులు అమె ఇంటికి చేరుకున్నారు.. అయితే వారిని ఇంటిలోనికి అనుమతించలేదు.. జరిగిన విషయాలను కవిత లాయర్ ను అడిగి తెలుసుకున్నారు.. ఇంటిలో ఆరు గంటల పాటు సోదాలు నిర్వహించారని , అలాగే కవిత వ్యక్తి గత ఫోన్ లను ఈడీ సిబ్బంది స్వాధీనం చేసుకున్నట్లు న్యాయవాది వివరించారు..
ఇది