నల్గొండ ఈద్గాలో బక్రీద్ పండుగ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనల్లో రాష్ట్ర రోడ్లు అండ్ భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ముస్లిం సోదరులకు ప్రత్యేకంగా బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
బక్రీద్ పండుగ త్యాగాలకు ప్రతీక.. నల్గొండ పట్టణంలో గత 30 సంవత్సరాలుగా మతసామరస్యాన్ని కాపాడుతున్నాం.. పేద ముస్లింలకు ఇండ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. జనాభా పెరుగుతున్న సందర్భంగా ఈద్గాను అభివృద్ధి చేస్తామన్నారు. అలాగే, ముస్లింలకు విద్యారంగంలో, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తాం.. ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలలో చదువుకున్న ముస్లిం యువతీ యువకులకు అవకాశాలు కల్పిస్తాం.. అందరూ బాగుండాలని అల్లాను ప్రార్థిస్తున్నాను అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.
- Advertisement -