Saturday, November 23, 2024

TS: గిరిజన హక్కుల సాధనకు ఉద్య‌మిద్దాం.. జీవో 3 పునరుద్ధరణకు లడాయి చేద్దాం..

తొర్రూరు (ప్రభ న్యూస్): గిరిజన హక్కుల సాధనకు ఉద్యమించాలని ఎల్ హెచ్ పిఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు వి. రాందాస్ నాయక్ పిలుపునిచ్చారు. శనివారం డివిజన్ కేంద్రంలో విలేక‌రుల‌తో మాట్లాడారు. జీవో నెంబర్ 3 పునరుద్ధరణ సాధనకు లంబాడీలు లడాయికి సిద్ధం కావాలన్నారు. గిరిజన రిజర్వేషన్ 6 నుండి 12 శాతానికి పెంచి, విద్య ఉద్యోగ రంగాలలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్టీల సమగ్ర అభివృద్ధి కోసం ఎస్టి బంధు, ఎస్టీ సబ్ ప్లాన్ అమలు చేయాలని, గిరిజనులు సాగు చేస్తున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

నూతన తండా గ్రామ పంచాయతీలకు అభివృద్ధి కోసం 20 వేల కోట్ల ప్యాకేజీ ఇవ్వాలన్నారు. గిరిజనుల పై జరుగుతున్న వివిధ రకాల కుట్రలను తిప్పికొట్టేలా, పోడు సాగు చేస్తున్న గిరిజనులకు బాసటగా నిలిచేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న గిరిజన వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నేడు నిర్వహించే చలో కొత్తగూడెం సదస్సుకు పార్టీలకు అతీతంగా గిరిజనులు, ఉద్యోగ సంఘాలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

ఈ సమావేశంలో ఎల్ హెచ్ పిఎస్ రాష్ట్ర సలహాదారుడు జాటోత్ బాలు నాయక్. జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ నరేందర్ పవర్, వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రకాష్ రాథోడ్, రాష్ట్ర నాయకులు భూక్య గిరి నాయక్, మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు శాంతి దాస్ రాం నాయక్, తారాబాయి, మంగళ పెళ్లి రవికుమార్,టి.వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement