హైదరాబాద్ – రిపేర్ చేయడానికి ఇబ్బంది ఏంటి భాద్యులపై చర్యలు తీసుకోండి రైతులను బలి చేయొద్దని కాంగ్రెస్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ రామారావు మండిపడ్డారు. బాధ్యత మరచి ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందన్నారు. వాస్తవాలు చెప్పడానికే మా ఈ చలో మెడిగడ్డ పర్యటన అని తెలిపారు. బీఆర్‌ఎస్ చలో మెడిగడ్డ పర్యటనకు బయలుదేరుతున్న సందర్భంగా నేడు హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డితో కలిసి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. తమ మీద కోపాన్ని రైతుల మీద చూపించొద్దన్నారు. రైతు ప్రయోజనం ముఖ్యం కాదు రాజకీయ ప్రయోజనం కాంగ్రెస్ పార్టీకి కావాలన్నారు. ఇవాలా చేస్తున్న మొదటి పర్యటన మాత్రమే.. తర్వాత అన్ని ప్రాజెక్టు లు పర్యటిస్తామన్నారు. రిపేర్ చేయడానికి ఇబ్బంది ఏంటి? భాద్యులపై చర్యలు తీసుకోండి.. రైతులను బలి చేయొద్దని కేటీఆర్ అన్నారు. రిపేర్ చేయకుండా ఉంటే వర్ష కాలంలో వరదలు వస్తే బ్యారేజ్ కొట్టుకుపోవాలని చూస్తున్నారని తెలిపారు.
ప్రపంచంలోనే గొప్ప లిఫ్ట్ ఇరిగేన్ ప్రాజెక్ట్ ..
ప్రపంచంలోనే అతి గొప్ప లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం అని మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. 5 వందలు 6 వందలు మీటర్ల లోతునుంచి నీళ్లను లిఫ్ట్ చేసే గొప్ప కార్యక్రమం అన్నారు. భీమా, నేటం పాడు ప్రాజెక్టు లు పూర్తి చేసి వలసలు ఆపేసినామని అన్నారు. 86 పిలర్లలో 3 పిలర్లు కుంగినై దేశ వ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టులో కూడా సాంకేతిక లోపాలు ఉంటాయని, వాటిని సరిదిద్దుకోవాలన్నారు. కాళేశ్వరంలో మొత్తం 196 స్కీం ఉన్నాయి.. మూడు పిలర్లు కుంగితే భూతద్దంలో పెట్టి చూస్తున్నారని తెలిపారు. కల్వకుర్తి ప్రాజెక్టు అసంపూర్తిగా ఉన్న మేం ఎన్నడు అవమానించలేదని అన్నారు. కడియం ప్రాజెక్టు రెండు మార్లు తెగింది, అలా అని ఇప్పుడు మెడిగడ్డ కేవలం కుంగింది తెగలేదన్నారు. రాజకీయాల కోసం రాజకీయ పబ్బం గడపడానికి రైతులను ఫణంగా పెట్టకండి అని కోరారు. రైతు ప్రయోజనాలకు అడ్డు పడొద్దని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. వచ్చే వర్ష కాలం కల్లా సుందిళ్ళ ,అన్నారం, ఎల్లంపల్లి, కొండపోచమ్మ,మల్లన్న సాగర్లో నీటిని నింపాలని కోరారు. రైతులను ఇబ్బంది పెడితే నష్టం కాంగ్రెస్ పార్టీకే అన్నారు..
ప్రాజెక్ట్ లపై కాంగ్రెస్ కు అవగాహన సున్నా… పొన్నాల ..
కాంగ్రెస్ నాయకులకు ప్రాజెక్టులపై కనీస అవగాహన లేదని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత పొన్నాల లక్ష్మయ్య అన్నారు. రాజకీయ లబ్ధి కోసమే కాళేశ్వరం ప్రాజెక్టుపై అర్ధసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఆ ప్రాజెక్టుతోనే నేడు అనేక జిల్లాలు సస్యశ్యామలమయ్యాయని చెప్పారు. పిల్లర్లు కుంగడం వంటి చిన్న ఘటన జరిగితే మరమ్మతు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. గతంలో అనేక ప్రాజెక్టులు నిర్మించినప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయన్నారు. అప్పటికప్పుడు వాటిని మరమ్మతులు చేశారు.. కానీ రాజకీయాలు చేయలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ప్రజలు తిప్పి కొడతారని తెలిపారు.