Sunday, November 3, 2024

TS – సిరిసిల్లలో తేల్చుకుందామా …కెటిఆర్ కు మంత్రి కోమ‌టిరెడ్డి స‌వాల్

హైదరాబాద్‌: భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సవాల్‌ విసిరారు. ‘ఎమ్మెల్యేలుగా ఇద్దరం రాజీనామా చేద్దాం. నేను సిరిసిల్లలో పోటీ చేస్తా. నాపై కేటీఆర్‌ గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా. సిరిసిల్లలో ఆయన ఓడితే భారాసను మూసివేస్తామని ప్రకటించాలి”అని సవాల్‌ చేశారు. ఇటీవ‌ల ఒక స‌మావేశంలో రేవంత్ మగాడివైతే వ‌చ్చే లోక్ స‌భ ఎన్నిక‌ల‌లో ఒక్క ఎంపి సీటుల‌లోనైనా గెలిపించాలంటూ కెటిఆర్ కు స‌వాల్ విసిరారు.. దీనికి స్పందించిన కెటిఆర్ కోడంగ‌ల్ మీరూ, సిరిసిల్లాలో నేను రాజీనామా చెద్దాం…ఆ త‌ర్వాత ఎంపిగా మీరు ప్రాతినిధ్యం వ‌హించిన మ‌ల్కాజిగిరి లోక్ స‌భ నుంచి ఇద్ద‌రం పోటీ చేద్దాం ర‌మ్మంటూ రేవంత్ ఆహ్వానం ప‌లికారు… అ ఎన్నిక‌తో ఎవ‌రు ఎంటో తేలిపోతుద‌న్నారు కెటిఆర్ .. ఈ నేప‌థ్యంలో మంత్రి కోమ‌టిరెడ్డి సెక్రటేరియట్‌లో కోమటిరెడ్డి మీడిమాతొ మాట్లాడుతూ, నల్గొండలో రిజైన్ చేస్తా.. కేటీఆర్ సిరిసిల్లలో రిజైన్ చేయాలన్నారు.. తాను సిరిసిల్లలో పోటీ చేస్తా.. ఒక వేళ ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా.. కేటీఆర్ ఓడిపోతే బీఆర్ఎస్ పార్టీని పార్టీ క్లోజ్ చేస్తారా అని సవాల్ విసిరారు.

కాగా, ఇక మ‌రో మంత్రి ఉత్త‌మ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీని తెలంగాణ నుండి పోటీ చేయాలని టీపీసీసీ నుండి ప్రపోజల్ పెట్టామని తెలిపారు. రాహుల్ గాంధీ ఆ రెండు చోట్ల ఎక్కడ పోటీ చేసిన నాలుగు లక్షలకు పైగా మెజారిటీ వచ్చే బాధ్యత తాము తీసుకుంటామని హామీ ఇచ్చారు. లోక్ సభ ఎన్నికల్లో త‌మ‌కు ప్రత్యర్థి బీజేపీనే.. బీఆర్ఎస్ పోటీనే కాదని తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ ఎలాగూ పోటీలో లేదని.. బీజేపీకి రెండు, మూడు సీట్లు వస్తాయేమో మాకైతే తెల్వదని అన్నారు.

బీజేపీ ఎంపీ తనకు రూ.2 వేల కోట్లు ఉన్నాయని అర్వింద్ అన్నార‌ని.. నా పేరుమీద ఎక్కడైనా అన్ని ఆస్తులు ఉంటే అరవింద్‌కు రాసి ఇస్తానని కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో తాము ఆస్తులు సంపాదించలేదని,ఉన్న ఆస్తులు పొగుట్టుకున్నామని తెలిపారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తనవి, కోమ‌టిరెడ్డివి ఆస్తులు తగ్గాయన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement