Sunday, November 24, 2024

TS: కన్నకొడుకే ఖతం చేస్తడట.. కలెక్టర్‌ సారూ మీరే కాపాడాలే..

సిద్దిపేట ప్రతినిధి, (ప్రభ న్యూస్‌) : నా పేరు బొల్లం కనుకమ్మ (65), భర్త పేరు ధర్మపురి (73) సిద్దిపేట పట్టణం భారత్‌ నగర్‌లో ఉంటున్నాం. మాకు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు పేరు గణేష్‌, చిన్న కొడుకు సుద ర్శన్‌. 50 సంవ త్సరాలు పిల్లల ఉన్నత స్థితికి కష్టపడి పనిచేశాం. పూర్వీకుల ఆస్తులను కాపాడుకుంటూనే స్వంతంగా అనేక వ్యాపారాలు నిర్వహించి వ్యవసాయ భూములు, ఇతర ఆస్తులు కొడుకుల కోసం సంపాదించాం. ఇప్పటికే కొన్ని ఆస్తులు కొడుకుల పేరున నమోదు అయి ఉన్నాయి.

వృద్ధాప్యంలో మేము ప్రస్తుతం వ్యాపారాలను నిర్వహించలే కపోతున్నాం. ఇప్పటికీ కొడుకులతో కలిసి నివసిస్తున్నాం. వ్యాపార, వ్యవసాయ లావాదేవీలు, కుటుంబ వ్యవహా రాలు అన్ని ఉమ్మడిగానే నడుస్తున్నాయి అని వారు చెపుతూ, ఈ మధ్య కాలంలో ఉమ్మడిగా వచ్చిన ఆదాయంతో కొనుగోలు చేసిన భూములు, ఆస్తులు, ప్లాట్‌లు, వ్యాపార లావాదేవీలు తనకే దక్కాలని తన చిన్న కొడుకు సుదర్శన్‌ తమను మానసిక వేదనకు గురి చేస్తున్నాడు.

- Advertisement -

కనిపెంచిన తల్లిదండ్రులు అని చూడకుండా భౌతిక దాడులు చేస్తూ, తమకు సహకరించకపోతే ఖతం చేస్తానని బెదిదిరింపు లకు పాల్పడుతున్నాడు. వృద్ధులైన మే ము దిక్కు తోచని స్థితిలో ఉన్నామని, మా సంరక్షణ, బాగోగులు చూడకుండా భౌతిక దాడులు చేస్తూ వృద్ధాప్యం లో మా నసిక క్షోభకు గురి చేస్తున్న చిన్న కొడుకు సుదర్శన్‌పై చర్యలు తీసుకోవాలని కోరు తూ సిద్దిపేట పట్టణం భారత్‌ నగర్‌కు చెందిన బొల్లం కనుకమ్మ ప్రజావాణిలో జిల్లా కలెక్టర్‌ వెం కట్రామిరెడ్డిని కలిసి వేడుకుంది. తక్షణమే స్పందించిన జిల్లా కలెక్టర్‌ వృద్ధురాలి ఫిర్యాదు ఆధారంగా వెంటనే చిన్న కొడుకు సుదర్శన్‌కు నోటీస్‌లు జారీ చేయాలని సిద్దిపేట ఆర్డీవో అనంత రెడ్డిని ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement