Saturday, November 9, 2024

TS – తెలంగాణ అంతటా కల్లు బార్లు ఏర్పాటు చేస్తాం – పొన్నం

మహబూబ్‌నగర్‌: రాబోయే రోజుల్లో ‘కల్లు బార్లు’ ఏర్పాటు దిశగా కార్యచరణ రూపొందిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మహబూబ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన గౌడ సంఘం ఆత్మీయ సమ్మేళనంలో ఎక్సైజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి ఆయన పాల్గొన్నారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో వివిధ కుల వృత్తులు మారుతున్నాయని చెప్పారు. అన్ని రకాల వ్యాపారాల తీరు మారుతోందని.. వాటితో పాటు గీత కార్మికుల వృత్తినీ ఆధునికీకరించాల్సిన అవసరం ఉందన్నారు. అందులో భాగంగా కల్లును కల్తీ లేకుండా గౌరవప్రదంగా అమ్మే విధంగా కార్యాచరణ రూపొందిస్తున్నామని వివరించారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి 90 రోజులైందని.. ఇప్పటివరకు 20 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారన్నారు. ప్రజల సమస్యలు పరిష్కారం కావాలంటే కేంద్రంలోనూ కాంగ్రెస్‌ ఉండాలని.. మహబూబ్‌నగర్‌ ఎంపీ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. ఎమ్మెల్సీ, ఎంపీ ఎన్నికలలో ఓట్లు అడిగే నైతిక అర్హత కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావులకు లేదని జూపల్లి విమర్శించారు.

ఆత్మీయ సమ్మేళనం లో ఎమ్మేల్యేలు యన్నం శ్రీనివాస్ రెడ్డి , మధుసూధన్ రెడ్డి , ఈర్లపల్లి శంకర్ , వాకటి శ్రీహరి ఇతర కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు

- Advertisement -

సంజీవ్ ముదిరాజ్ కు పరామర్శ….

ఇటీవల సంజీవ్ ముదిరాజ్ తండ్రి గోవర్ధన్ మృతి చెందగా ఈరోజు వారి నివాసంలో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ,యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి తో కలిసి గోవర్ధన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు పొన్నం.. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి దైర్యం చెప్పారు

Advertisement

తాజా వార్తలు

Advertisement