Tuesday, November 19, 2024

TS ఢిల్లీకి ముడుపులు పంపే కాంగ్రెస్ కు రైతులను పట్టించుకునే తీరిక ఏది – జగదీష్ రెడ్డి

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పాలనలో రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌ రెడ్డి అన్నారు. నీళ్లు లేక వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని చెప్పారు. రైతులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వెల్లడించారు. రైతులను ఆదుకోవాలన్న సోయి కూడా కాంగ్రెస్‌కు లేదని విమర్శించారు. కాంగ్రెస్‌ మంత్రులు పాలన గాలికొదిలేశారని విమర్శించారు. హైదరాబాద్‌ తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.

నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో పరిస్థితి ఘోరంగా ఉందన్నారు. గతంలో కేఆర్‌ఎంబీ అడ్డు చెప్పినా తాము పొలాలకు నీళ్లు ఇచ్చామని చెప్పారు. నాగార్జున సాగర్‌ కట్ట మీదకు వెళ్లడానికి మంత్రులకు లాగులు తడుస్తున్నాయన్నారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిలు సోయి లేకుండా ఉన్నారని మండిపడ్డారు.ప్రభుత్వం ఇక్కడ వసూళ్లు చేసి ఢిల్లీకి ముడుపులు కట్టే పనిలో బిజీగా ఉన్నదని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్‌, బీజేపీ అవగాహణతోనే అభ్యర్థులను పెడుతున్నారని ఆరోపించారు. ప్రజల్లో బలం లేని రెండు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని చెప్పారు. గతంలో ఎమ్మెల్సీ కవిత విచారణ చేసి, ఏమీ తేలలేదని స్పష్టతనిచ్చారని వెల్లడించారు. ఇప్పుడు ఎన్నికల వస్తున్నాయని అరెస్టు చేశారని విమర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement