Saturday, November 23, 2024

TS: మత్తు కథ.. మామూలుగా లేదట.. ఆఫీసర్లను అలర్ట్‌ చేసిన శీనన్న

Telangana Govt: మత్తు వదిలించాల్సిందే పేరుతో ఆంధ్రప్రభ దినపత్రికలో ప్రచురితమైన కథనం ఎక్సైజ్‌ శాఖలో ఉరుకులు పరుగులు పెట్టించింది. గంజాయి నుంచి మత్తు మందులు, మాదక ద్రవ్యాల వరకు ఉత్పత్తి నుంచి మొదలుకొని ఇతర రాష్ట్రాలకు సరఫరా తీరుపై వచ్చిన సమగ్ర సమా చారం ఆధారంగా శుక్రవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించింది.

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఆంధ్రప్రభ కథనం ఆధారంగా నిఘా ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడినుంచి ఎక్కడెక్కడా ఎలా నిషేధిత మత్తు పదా ర్ధాలు, గంజాయి వంటి వాటి సరఫరా జరుగు తుందో ఈ కథనంలో సమాచారం ఉందని, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు, ఎక్సైజ్‌ క్షేత్ర స్థాయి సిబ్బంది వీటి కట్టడిపై నిఘాపెట్టి, నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆదేశించారు. విజయవాడ హైవే, ఔటర్‌లపై ప్రత్యేక బందాలతో తనిఖీలు చేపట్టాలని సూచించారు.

ఇందుకు ప్రత్యేక బృం దాలను నియమించాలని ఎక్సైజ్‌ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు. ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌ శాఖల ఉన్నతాధికారులతో అబ్కారీ శాఖ మంత్రి శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు తెలంగాణను డ్రగ్స్‌రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌ శాఖల ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

- Advertisement -

రాష్ట్రంలో గంజాయి, మత్తు పదార్థాల ఉత్పత్తి, అక్రమ సాగు, రవాణా, అమ్మకాలు, వినియోగంపై ఉక్కుపాదం మోపాలని మంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. గతంలో సీఎం కేసీఆర్‌ గుడుంబా నిర్మూలనపై ఇచ్చిన ఆదేశాల మేరకు తెలంగాణను గుడుంబ రహిత రాష్ట్రంగ తీర్చిదద్దుతామన్నారు. అదే స్ఫూర్తితో గంజాయిని నిర్మూలిం చాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో అబ్కారీ శాఖ డైరెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌, జాయింట్‌ కమిషనర్‌ అజయ్‌రావు, డిప్యూటి కమిషనర్లు, అసిస్టెంట్‌ కమిషనర్లు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏసీ చంద్రయ్యగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement