Monday, November 18, 2024

TS Inter: ఎల్లుండి నుంచే.. ఇంటర్ ఎగ్జామ్స్‌

సోమ‌వారం నుంచి తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్స్‌ జరగనున్నాయి. పరీక్షలను రద్దు చేసి, విద్యార్థులందరినీ పాస్ చేయాల‌ని దాఖలైన పిటిషన్లను హైకోర్టు నిన్న తిరస్కరించింది. దీంతో ఎగ్జామ్స్ అనివార్య‌మ‌య్యాయి. కాగా, పరీక్షల నిర్వహణకు ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

25 నుంచి నవంబర్ 3వ తేదీ వరకు ఫస్టియర్ ఇంటర్ పరీక్షలను నిర్వహించనున్నట్టు ఇంటర్ బోర్డు సెక్రటరీ ఉమర్ జలీల్ తెలిపారు. 70 శాతం సిలబస్ నుంచి పరీక్షలను నిర్వహిస్తున్నామని, ప్రశ్నల్లో 50 శాతానికి పైగా చాయిస్ రూపంలో ఉంటాయ‌న్నారు. హుజూరాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలో రెండు పరీక్షలను రీషెడ్యూల్ చేసిన‌ట్టు తెలిపారు. ఆదివారం కూడా పరీక్ష కొనసాగుతుందన్నారు.

మొత్తం 4,59,237 మంది విద్యార్థులు పరీక్షలు రాయ‌నున్నార‌ని,17,068 సెంటర్లలో పరీక్షలు నిర్వ‌హించ‌నున్నట్టు చెప్పారు. వ్యాక్సిన్ తీసుకున్న 25 వేల మందిని ఇన్విజిలేటర్లుగా నియమించామన్నారు జ‌లీల్‌. పరీక్ష కేంద్రాల్లో థర్మల్ స్క్రీనింగ్ ఉంటుందని. ఎవరికైనా జ్వరం ఉంటే ప్రత్యేక గదుల్లో పరీక్ష రాయిస్తామ‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement