తెలంగాణలో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థుల మార్కుల మెమోలను ఇంటర్ బోర్డు ఈ రోజు విడుదల చేయనుంది. సాయంత్రం 5 గంటల నుంచి విద్యార్థులు తమ మెమోలను డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. విద్యార్థులు https://tsble.cgg.gov.in వెబ్ సైట్ లో చూసుకోవచ్చని చెప్పారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఫెయిలైన విద్యార్థులకు కూడా కనీస పాస్ మార్కులు వేసినట్టు వెల్లడించారు.
రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ ఫీజు వెనక్కి తీసుకునేందుకు అవకాశం కల్పించామని తెలిపారు. రీకౌంట్, రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న ఫస్టియర్ విద్యార్థులు సాయంత్రం 5 గంటల నుంచి తమ దరఖాస్తులను రద్దు చేసుకోవచ్చని చెప్పారు. ఈనెల 17 వరకు ఈ అవకాశం అందుబాటులో ఉంటుందని తెలిపారు. చెల్లించిన ఫీజును ఫిబ్రవరి 1 నుంచి కాలేజీల్లో తీసుకోవచ్చని వెల్లడించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..