సూర్యాపేట(టౌన్), ప్రభన్యూస్ : రైతులకు ప్రభుత్వం మద్ధతు ధర అందించకపోతే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమం తప్పదని మాజీ పీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖరీఫ్ పంట కొనుగోలులో రైతుకు న్యాయం చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలం చెందిందని మండిపడ్డారు. సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌లో రైతులకు మద్ధతు ధర లభించడం లేదని ఆరోపించారు. రైతుల విషయంలో ప్రభుత్వ తీరు మారని పక్షంలో రైతుల పక్షాన ఉద్యమాలను బలోపేతం చేస్తామన్నారు.
రబీ పంటలో వరిపై ఆంక్షలు పెట్టవద్దన్నారు. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్, నాయకులు తూముల భుజంగరావు, చకిలం రాజేశ్వర్ రావు, గుడిపాటి నర్సయ్య, అంజద్ అలీ, కక్కిరేణి శ్రీనివాస్, బైరు శైలేందర్, పోలగాని బాలు గౌడ్, నరేందర్ నాయుడు, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.