తెలంగాణ లోక్ సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ఎన్నికల కమీషన్ షాకిచ్చింది. 48 గంటలపాటు ఎలాంటి ప్రచార కార్యక్రమాలు చేయొద్దని నిషేధం విధించింది. అయితే, దీనిపై కేసీఆర్ స్పధించారు… మహబూబాబాద్ లో జరిగిన రోడ్ షోలో మాట్లాడుతూ… ‘‘ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, మరి ఆయనపై ఈసీ ఎందుకు చర్యలు తీసుకోలేదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రశ్నించారు. రేవంత్ నా పేగులు మెడలో వేసుకుంటా, గుడ్లు పీకుతా అన్నాడు. ఆయనపై ఈసీ చర్యలు తీసుకోవట్లేదని ప్రశ్నించారు. ఎన్నికల కమీషన్ 48 గంటలు నా ప్రచారాన్ని నిషేదిస్తే.. 96 గంటలు అవిశ్రాంతంగా బీఆర్ఎస్ కార్యకర్తలు పని చేస్తారు” అని కేసీఆర్ అన్నారు.
TS | నా ప్రచారాన్ని నిషేదిస్తే.. కార్యకర్తలు రెట్టింపుగా పనిచేస్తారు : కేసీఆర్
Advertisement
తాజా వార్తలు
Advertisement