Friday, November 22, 2024

TS: వరి విత్తనాలు అమ్మినట్లు తెలిస్తే.. ఇక వేట‌డ‌మే.. ఎవ‌ర‌న్నారో తెలిస్తే షాక్ అవుతారు..

కొంత‌మంఇ అధికారుల తీరుపై సిద్దిపేట కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి సీరియ‌స్ అయ్యారు. యాసంగిలో వరి పంట వేయడం అంత మంచిది కాదని.. ఈ విషయం రైతులకు అర్థ‌మ‌య్యేలా చెప్పాలన్నారు. జిల్లాలో రైతులకు వరి విత్తనాలు అమ్మినట్లు తెలిస్తే వారిని వేటాడి చెండాడుతానన్నారు క‌లెక్ట‌ర్‌. ఏవో, ఏఈవోపై చర్యలు తీసుకుంటానన్నారు.

ఎవరైనా వరి విత్తనాలు అమ్మితే వారి షాపులు సీజ్‌ చేస్తానని హెచ్చరించారు క‌లెక్ట‌ర్ వెంక‌ట్రాంరెడ్డి. సుప్రీంకోర్టు ఆర్డర్‌ తెచ్చినా, పైరవీలు చేసినా సీజ్‌ చేసిన షాపులు తాను ఉన్నంతవరకు తెరవబోనివ్వన‌ని సీరియ‌స్ వార్నింగ్ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement