నిజామాబాద్ ప్రతినిధి (ప్రభ న్యూస్): ఒక్కగానొక్క కొడుకుని అల్లారుముద్దుగా పెంచుకున్న కన్నపేగు మమకారం ఏమైందో ఏమో…! తాము మరణిస్తే తన బిడ్డను చూసుకునే దిక్కు ఉండదనే ప్రేమను మరిచిన వాళ్ళ అనాలోచిత నిర్ణయం అమ్మానాన్న అనే అర్థానికి మసిపూసినట్లయ్యింది. పరీక్ష రాసి ఇక సెలవుల్లో అమ్మానా న్నలతో సంతోషంగా గడపొ చ్చని ఆనందంతో ఇంటికొచ్చిన ఆ బిడ్డకు అమ్మానాన్నలు విగతజీవులుగా కనిపించ డంతో దిక్కుతోచని పక్షిగా మారాడు.
అమ్మా… నాన్న నేనేమీ పాపం చేశానని నన్ను అనాథను చేసి శిక్ష వేశారు. మీ కడుపున పుట్టడమే నేను చేసిన నేరమా … ? మంచిగా చదువుకుని మీ కష్టాలని తీర్చుతానని నేను ఆలోచిస్తే… నాకోసం మీరు చేసింది ఇదేనా ? ఇంకా మీలాగా నన్ను ప్రేమతో చూసుకునేది ఎవరమ్మా ? ఒకసారి నాకోసం లేవండి అమ్మ. ఒక్కసారి కళ్ళు తెరిచి నన్ను చూడు నాన్న అంటూ ఆ పసి హృదయం రోదన అందరినీ కలిచివేసింది.
నిజామాబాద్ నగరంలో బుధవారం రోజున భార్యను చంపి భర్త బలవన్మరణానికి పాల్పడడం కలకలం రేపింది. ఈ సంఘటనకు ఆర్థిక ఇబ్బం దులే కారణమని తెలుస్తుంది. మృతుడి కొడుకు మోడల్ పాఠశాలలో ఇంటర్ విద్యను అభ్యసిస్తున్నాడు. ఇంటర్ పరీక్ష రాసి వచ్చేసరికి తల్లిదండ్రులు విగతజీవులుగా పడి ఉండ డంతో కొడుకు గుండెలవిసెలా రోదించిన తీరుఅక్కడ ఉన్న వారిని కన్నీరు పెట్టించింది.
నిజామాబాద్ నగరంలోని 5వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖిల్లా కెనాల్ కట్ట ప్రాంతంలోని ఆటో డ్రైవర్ స్వామి (45) , లక్ష్మీ (40) దంపతులు తమ కుమారుడు మల్లికార్జున్ తో కలిసి నివసిస్తున్నారు. మృతు డు ఆటో డ్రైవింగ్ చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. కుమారుడు మల్లికార్జున్ డిచ్పల్లి మండలం బిబిపూర్ మోడల్ స్కూల్లో ఇంటర్మీడి యట్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.
ముమృతుడు స్వామి తన భార్య దేవలక్ష్మీని హత్యచేసి తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తమ మృతికి ఎవరూ కారకులు కాదని, మనస్థాపంతోనే తానే ఆత్మ హత్యకు పాల్పడుతున్నట్లు మృతుడు తన ఫోన్ నుంచి 14 వాట్సాప్ వాయిస్ మెస్సెజ్ లను పోస్టు చేశాడు. తన జీవ న ఆధారమైన ఆటో నడు వడం లేదని, ఆర్థిక పరిస్థితులు కూడాబాగా లేవని అందులో వాపోయాడు. తన ఆత్మహత్య కు ఎవరూ కారణం కాదని అందులో పేర్కొన్నాడు. తన అనంతరం తన ఆస్తులు తన కొడుకుకే చెందాలని అందులో పేర్కొన్నాడు
.. సంఘటన స్థలాన్ని నిజామా బాద్ నార్త్ రూరల్ సీఐ సతీష్, పోలీస్ అధికారులు సందర్శించి వివరాలు సేకరించారు పోలీ సులు కేసు నమోదు చేసి మృతదే హాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు.