నిర్మల్ ప్రతినిధి (ప్రభ న్యూస్) : నిర్మల్ జిల్లాలో బీఆర్‌ఎస్ పార్టీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది. మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. తాను రాజీనామా చేసిన పత్రాన్ని (బుధవారం) బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కేసీఆర్‌కు పంపారు. అనంతరం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి దీపా దాస్ మున్సి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.