కాంగ్రెస్ పార్టీ లో అంతర్గత కుమ్ములాటలతో ఆరు నెలల్లో ప్రభుత్వం కూలడం ఖాయమని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జనగామ శాసనసభ్యులు పల్లా రాజేశ్వర్ రెడ్డి స్టేషన్గన్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి లు అన్నారు. ప్రజల దృష్టి మరలించేందుకు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ అన్నారం బ్యారేజీలపై కాంగ్రెస్ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తున్నదని మండి పడ్డారు… మేడిగడ్డకు బయలుదేరిన కెటిఆర్ బృందానికి స్టేషన్గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పాలకుర్తి మాజీ శాసనసభ్యులు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తో పాటు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఎంపీ పసునూరి దయాకర్ రావు జడ్పిటిసి గుడి వంశీధర్ రెడ్డి నిమ్మతి దీపిక ఎంపీపీ చిట్ల జయశ్రీ మేకల కళింగరాజులు పెంబర్తి కాకతీయ కళాతోరణం వద్ద పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా , మాజీ మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి లు మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన అన్నారం మేడిగడ్డ బ్యారేజీలపై అవినీతి ఆరోపణలు చేయడం మాని ప్రజలకు రైతాంగానికి సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.
అంతేకాకుండా మేడిగడ్డ ప్రాజెక్టు వాస్తవాలను ప్రజలకు వివరిస్తూ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు ఎప్పటికప్పుడు తిప్పి కొట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంతర్గత కుమ్ములాటలలో ఆరు నెలలు కూలిపోతుందని జోస్యం చెప్పారు కార్యకర్తలు పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.
ఇది ఇలా ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం బరాజ్‌పై ప్రభుత్వం చేస్తున్న ఆరోపణల్లో వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. ఇందులో భాగంగా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల బృందం మేడిగడ్డను బయలుదేరింది. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్ నుంచి పార్టీ ఎమ్మెల్యేలు, శాసనమండలి, పార్లమెంట్ సభ్యులు, ఇతర ముఖ్య నాయకులు ప్రత్యేక బస్సుల్లో మేడిగడ్డకు పయనమయ్యారు. వారితోపాటు సాగునీటిరంగ నిపుణులు కూడా ఉన్నారు. మేడిగడ్డ పరిశీలన తర్వాత అన్నారం బ్యారేజ్‌ని పరిశీలించనున్నారు. అన్నారం వద్ద పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. కాళేశ్వరంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బరాజ్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టనున్నారు. ప్రజలకు వాస్తవాలను వివరించనున్నారు.