హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో : రాష్ట్రంలో ఎన్నికల వేడి ప్రారంభం కాక ముందే.. అంతకు మించిన టిక్కెట్ల హడావుడి తీవ్రస్థాయిలో కొనసా గుతోంది. ఒకరిని మంచి మరొకరు మూడు ప్రధాన పార్టీల అధి నాయకులు ఒకే విధానాన్ని అనుసరిస్తున్నారు. టిక్కెట్ల కేటా యింపు కసరత్తులో భాగంగా సర్వేలు జోరందుకున్నాయి. భారీ ఖర్చుతో సూక్ష్మ సర్వేలు నిర్వహిస్తూ అభ్యర్థుల బలా బలాలను అంచనా వేస్తున్నారు. అభ్యర్థుల ఎంపికలో సర్వే ఆధారిత లెక్కలనే పరిగణనలోకి తీసుకుంటు న్నారు. ఈ క్రమంలో గత కొన్నేళ్ళుగా తిష్టవేసి కూర్చున్న ఆశావహులత్లో ఆందోళన నానాటికీ పెరుగుతోంది. మొదట్లో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అభ్యర్థుల ఎంపికలో సర్వే ఆధారిత విధా నానికి తెరలేపగా.. ఆ వెంటనే తామేమీ తక్కువ కాదన్న ధోరణితో కాంగ్రెస్, బీజేపీలు సర్వేల వ్యూహానికి పదునుపెట్టాయి.
తాజా పరి స్థితులను పరిశీలిస్తే, రాష్ట్రంలో మూడు ప్రధాన పార్టీలదీ ఒకే వ్యూహంగా కనిపిస్తోంది. విజయమే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో పావులు కదుపుతున్న ఆయా పార్టీల అధినాయకులు ఈసారి అభ్యర్థుల ఎంపికలో సామాజిక వర్గాలను పక్కన బెట్టి సర్వే ఆధారిత అంచనాలే ఫైనల్ అన్న సంకేతాలు ఇస్తున్నారు. పార్టీల విధానం ఇలా ఉంటే.. తామేమీ తక్కువ కాదన్న సంకేతాలిస్తూ ఆశావహులు తమదైన శైలిలో వ్యక్తిగత సర్వేలు నిర్వహించుకుంటున్నారు. ఆ నివేది కలను పార్టీ అధిష్టానానికి పంపిస్తూ తమకున్న ప్రజా బలాన్ని చాటుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏ నియోజకవర్గంలో చూసినా ప్రతి పార్టీ, ప్రతి అభ్యర్థికీ సోషల్ మీడియా వింగ్ ఏర్పాటై ఉంది. టిక్కెట్లు ఇచ్చినా, ఇవ్వకున్నా ఎన్నికల బరిలో తామున్నామన్న సంకేతాలు కాస్త గట్టిగానే పంపిస్తున్నారు.
మరో ఐదు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో ఎన్నికల కోడ్ వెలువడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు గెలుపే లక్ష్యంగా వ్యూ హాలు రచిస్తున్నాయి. ఇప్పటికే రెండు సార్లు అధికారంలో ఉన్న బిఆర్‌ఎస్ వచ్చే ఎన్నికల్లో గెలిచి మూడోసారి కూడా అధికారం చేపట్టాలని చూస్తుంటే.. మరోవైపు ఈసారి బీఆర్‌ఎస్‌కు షాక్ ఇచ్చి అధికారంలోకి రావాలని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అన్ని దారుల్లోనూ ప్రయత్నాలు చేస్తున్నాయి. దీంతో ఈసారి ఎన్నికలు రసవత్తరంగా మరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీల మద్య పోలిటికల్ వార్ ఈసారి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ఇప్పటికే ఎన్నికలే టార్గెట్ గా బీఆర్‌ఎస్ గట్టి ప్రణాళికలతో ముందుకు సాగు తోంది. నియోజిక వర్గాల వారీగా పార్టీ బలాబలహీనతలను అంచనా వేస్తూ నేతలకు దిశా నిర్దేశం చేస్తున్నారు కేసిఆర్. ప్రజల్లో వ్యతిరేకత ఉన్న నేతలకు టికెట్లు- ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు. పద్దతి మార్చుకోవాలని లేదంటే ఎంతటి నేతల-కై-నా వేటు- తప్పదని హెచ్చరిస్తున్నారు.
సర్వేల ఆధారంగానే టికెట్ల కేటాయింపు ఉంటు-ందని, కాబట్టి ప్రజా ప్రతి నిధులందరూ నిబద్దతతో పని చేయాలని బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పదేపదే సూచిస్తున్నారు. సేమ్ ఇదే ఫార్ములా ను బీజేపీ కూడా అనుసరిసు ్తన్నట్లు- తెలుస్తోంది. కర్నాటక ఎన్నికల్లో ఓటమి తరువాత క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతం పై దృష్టి పెట్టిన కమలం పార్టీ వచ్చే ఎన్నికల్లో ప్రజా మద్దతు ఉన్న వారికే టికెట్లు- అని తేల్చి చెబుతోంది. తాజాగా జరిగిన కార్యనిర్వాహక సభలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఇప్పటికే నియోజిక వర్గాల వారీగా సర్వేలు చేయిస్తున్నామని, సర్వేల ఆధారంగా క్షేత్ర స్థాయిలో యాక్టివ్‌గా ఉన్నవారికే వచ్చే ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు ఉం టు-ందని చెప్పుకొచ్చారు. అలాగే పార్టీలో క్రమశిక్షణ చర్యలు ఉల్లం ఘించిన వారికి చర్యలు తప్పవని కూడా హెచ్చరించారు. ఇలా అటు- బీఆర్‌ఎస్, ఇటు- బీజేపీ.. ఈ రెండింటికీ భిన్నంగా కాంగ్రెస్ పార్టీలు కూడా వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టు-కొని బరిలో నిలిపే నేతల విషయంలో ఒకే విధంగా ఆలోచిస్తుండడం కొంత ఆశ్చర్యం కలిగించే విషయమేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
వచ్చే ఎన్నికల్లో సోషల్ మీడియా ప్రచారమే కీ రోల్
ఏ కోనంలో చూసినా ఈ సారి జరుగనున్న సార్వత్రిక ఎన్నికలు గతానికి పూర్తి భిన్నంగా జరుగనున్నాయి. సోషల్ మీడియా ప్రచారం అత్యంత ప్రభావం చూపనుంది. ప్రతి నియోజకవ ర్గంలో, పోటీ చేయాలనుకుంటున్న ప్రతి నాయకుడూ 5 నుంచి 10 మంది నిపుణులతో సైబర్ టీ-ంలు ఏర్పాటు చేసుకు న్నారు. నిత్యం లీడర్ల ప్రతి ప్రోగ్రాం జనానికి చేరేలా చేయ డమే సైబర్ వింగ్స్ లక్ష్యంగా పనిచేస్తున్నాయి. ఎన్నికల ఏడాది కావడంతో ఎక్కడ చూసినా మీడియా వేదికగా పాలిటిక్స్ నడుస్తు న్నాయి. ఫేస్ బుక్, వాట్సప్, ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్ వేది కలుగా ప్రధాన పార్టీ లీడర్లు ప్రచారం చేసుకుం టు-న్నారు. ఇందుకోసం రూ.లక్షలు ఖర్చు చేసి ఎక్స్‌పర్ట్స్ టీ-ంలను రిక్రూట్ చేసుకుంటు-న్నారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు తమకోసం పనిచేయాలని అగ్రిమెంట్ చేసుకుంటు-న్నారు. ఈ మేరకు వారికి అన్ని రకాల సౌలత్‌లు కల్పిస్తున్నారు. ఈ టీ-ంలు లీడర్ల ప్రోగ్రామ్‌లను ప్రచారం చేయడమే కాకుండా, ఆయా పార్టీల విధానాలను సైతం ప్రజలకు చేరువ చేస్తున్నారు. లీడర్ల రోజువారీ పర్యటనలు, అభివృద్ధి కార్యక్రమాల ఫొటోలతో నిత్యం వైరల్ చేస్తున్నారు.
అభ్యర్థుల సైబర్ టీంలకు భారీ వ్యయంతో కూడిన కార్యాచరణ ప్రణాళికను అప్పగిస్తూ పని చేయిస్తున్నారు. ఒకప్పుడు రాష్ట్ర స్థాయి రాజకీయాలు శాసించే లీడర్లు పీకే లాంటి ఎన్నికల వ్యూహకర్తలతో అగ్రిమెంట్లు- చేసుకునేవారు. వారు తమ సొంత సంస్థలతో సర్వేలు చేస్తూ, ప్రజల్లో ఆ పార్టీ పట్ల సానుభూతి కలిగేలా పోస్టులు పెట్టేవారు. ప్రస్తుతం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం లోని అధికార, ప్రతిపక్ష నేతలు, ఆశావహులు కూడా సోషల్ మీడియా వింగ్ ఏర్పాటు- చేసుకుం టు-న్నారు. ఒక్కో వింగ్ లో ఐదు నుంచి 10 మంది సభ్యు లను నియమించుకుని వారికి సుమారు రూ.10 నుచంఇ రూ.15 లక్షల వరకు చెల్లిస్తున్నట్లు- సమాచారం.