Saturday, November 23, 2024

TS: హుజురాబాద్ లో ఈట‌ల న‌మ్మింది ఎవ‌రినో తెలుసా!

టీఆర్ ఎస్ నుంచి బ‌య‌టికి వ‌చ్చాక‌ హుజురాబాద్‌లో ఈటల రాజేందర్ ఒంట‌రి అయ్యారి? పోలింగ్‌కు ముందు ఆయన ఎవరిపై నమ్మకం ఉంచుతున్నారు? ఈటలలో వచ్చిన మార్పేంటి? అనే ప‌లు అంశాల‌పై ఇప్పుడు పొలిటిక‌ల్ స‌ర్కిళ్ల‌లో హాట్ హాట్‌గా చ‌ర్చ జ‌రుగుతోంది..

హుజురాబాద్‌లో రేపే పోలింగ్ జ‌ర‌గ‌నుంది. 72 గంటల ముందే మైకులు బంద్ అయ్యాయి. కాగా, ఈటల రాజేందర్‌ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినప్పటి నుంచి కాలికి బలపం కట్టుకుని నియోజకవర్గమంతా కలియ తిరిగారు. ఉపఎన్నిక షెడ్యూల్‌ వచ్చాక.. నామినేషన్‌ వేశాక.. ప్రచారం స్పీడ్‌ పెంచాయి బీజేపీ శ్రేణులు.

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, పార్టీ ఇన్‌చార్జి తరుణ్‌చుగ్‌ మొదలుకొని కాషాయదండు మొత్తం అక్కడే తిష్ట వేసింది. బూత్‌ కమిటీలు.. ఓటర్లను ప్రత్యక్షంగా కలిసి మాట్లాడం వంటి సంప్రదాయ పద్ధతుల్లో బీజేపీ శ్రేణులు తిరిగేశాయి. ఇదంతా బాగానే ఉన్నా.. అభ్యర్థి ఈటల రాజేందర్‌లో ఎక్కడో అనుమానం వెంటాడినట్టు సమాచారం.

పోలింగ్‌కు ముందు అంతా తానే చూసుకోవాలని ఈటల రాజేందర్‌ డిసైడ్‌ అయినట్టు సమాచారం. అయితే ఎందుకు అన్నదే ఇప్పుడు ఎదుర‌వుతున్న ప్రశ్న. తనది కమ్యూనిస్ట్ మెంటాలిటీ అని చెప్పుకొనే ఈటల.. రాజకీయ పరిస్థితులు, త‌ప్ప‌ని సిచ్యుయేష‌న్‌ కారణంగానే బీజేపీలో చేరారు. సుదీర్ఘకాలం టీఆర్ఎస్‌లో ఉండటం వల్లో ఏమో బీజేపీలో చేరినా అక్కడ గాలి ఇంకా వంటబట్టలేని తెలుస్తోంది. తనకు రాజకీయంగా జీవన్మరణ సమస్యలాంటి హుజురాబాద్‌ ఉపఎన్నికలో బీజేపీ నేతలపై ఆధారపడితే మొదటికే మోసం వస్తుందని అనుకున్నారో ఏమో.. సొంత కేడర్‌ను నమ్ముకోవాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.

హుజురాబాద్‌లో మొదటి నుంచి ఈటల రాజేందర్‌ సెంటిమెంట్‌ను నమ్ముకుంటున్నారు. ఇప్పుడు కూడా ఆ సెంటిమెంట్‌పైనే ఎక్కువ విశ్వాసం ఉంచారట. ఈ ఉపఎన్నికలో మొదటి నుంచి బీజేపీ అభ్యర్థిగా కంటే ఈటల రాజేందర్‌గానే ఫోకస్‌ కావడానికి ప్రాధాన్యం ఇచ్చారు.

- Advertisement -

ఉపపోరు ఈటల వర్సెస్‌ టీఆర్ఎస్‌ అన్నట్టుగా వేడి కొనసాగించేందుకు ఆయన అనుచరులు మొగ్గు చూపారు. పైగా ప్రచారం ముగిశాక.. పోలింగ్‌ మొదలయ్యే వరకు డబ్బుల పంపిణీని కీలకంగా భావిస్తారు. ఈ అంశంలోనూ పార్టీ వారిని కాకుండా సొంతవారిపైనే ఈటల ఎక్కువ నమ్మకం ఉంచినట్టు టాక్‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement