Tuesday, November 26, 2024

దృఢమైన, దార్శనికత కలిగిన నాయకత్వం వల్లనే తెలంగాణ‌లో అభివృద్ధి..

హైద‌రాబాద్ – జాతీయ రక్షణ కళాశాల ప్రతినిధి బృందం నేడు బీఆర్‌కేఆర్‌ భవన్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో సమావేశమైంది. ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టి అమలుచేస్తున్న పలు కార్యక్రమాల గురించి వారికి వివరించారు. ముఖ్యమంత్రి మానస పుత్రిక అయిన హ‌రితహారం కార్యక్రమం కింద గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 270 కోట్ల మొక్కలు నాటార‌ని తెలిపారు.. ఈ మొక్క‌లు నాట‌టం ద్వారా 7.7 శాతం గ్రీన్ కవర్‌ను పెంచడానికి సహాయపడిందని ప్రధాన కార్యదర్శి పేర్కొన్నారు. దృఢమైన, దార్శనికత కలిగిన నాయకత్వం వల్లనే రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతుందని జాతీయ రక్షణ కళాశాల ప్రతినిధి బృందం సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement