కాంగ్రెస్‌పై ట్విట్టర్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి కాంగ్రెస్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీది పూర్తిగా ద్వంద్వ నీతి అని.. విమర్శించారు. కాంగ్రెస్ విడుదల చేసిన జాతీయ మేనిఫెస్టోలో రాజ్యాంగ పరిరక్షణ అనే చాప్టర్‌లోని 13వ పాయింట్ గురించి కేటీఆర్ ప్రస్తావించారు.
ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి వెళితే వెంటనే అనర్హత వేటు పడేలా చట్టాన్ని సవరిస్తామని కాంగ్రెస్ చెబుతోంది… కానీ తెలంగాణలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేకు ఎంపీ టికెట్ కేటాయించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి మరీ కాంగ్రెస్‌లో చేర్పించుకుంటోందని కేసీఆర్ విమర్శించారు. గెలిచే అంత వరకు ఒక మాట… గెలిచాక ఇంకో మాట.. ఇదే కాంగ్రెస్ రీతి.. నీతి అంటూ దుమ్మెత్తిపోశారు. బీజేపకి కాంగ్రెస్‌కి తేడా ఏంటో అని ప్రశ్నించారు.