Tuesday, November 26, 2024

TS | మెదక్‌లో కాంగ్రెస్ అభ్యర్ధి నీలం మధును గెలిపించాలి : ప్రొఫెసర్ కోదండరాం

ప్రజాస్వామ్యం, రాజ్యాంగ పరిరక్షణకు అందరూ ఏకమై పార్లమెంట్ ఎన్నికలలో మెదక్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధును గెలిపించాలని తెలంగాణ జన సమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం విజ్ఞప్తి చేశారు. మెదక్ జిల్లా కేంద్రంలో బుధవారం తెలంగాణ జన సమితి ఆధ్వర్యంలో ” రాజ్యాంగ పరిరక్షణ ” నిర్వహించిన సదస్సుకు ప్రొఫెసర్ కోదండరాం ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ముఖ్యంగా గత పదేళ్ల బిజెపి పాలనలో అసమానతలు తీవ్రంగా పెరిగిపోయాయని అన్నారు 70 కోట్ల మంది పేద ప్రజలు 15శాతంమాత్రమే సంపాదన కలిగి ఉన్నారని తెలిపారు.

ఇంత తీవ్రమైన ఆసమానతలు ఎన్నడూ లేవని స్పష్టం చేశారు. రైతులకు ఐదు లక్షల కోట్ల రుణమాఫీ చేయడానికి ప్రభుత్వం వద్ద డబ్బు లేదన్నారు. కానీ 30 లక్షల కోట్లు కార్పొరేటర్ రంగానికి రుణమాఫీ చేశారని చెప్పారు. అలాగే నిరుద్యోగం దాదాపు నాలుగు రేట్లు పెరిగిపోయిందన్నారు. వ్యవసాయం మీద వ్యవసాయ బడ్జెట్ 30శాతం తగ్గించింది, వ్యవసాయ సబ్సిడీ 43 శాతానికి తగ్గించిందన్నారు.

జీఎస్టీతో దాదాపు 38 వేల కోట్లు అదనపు ఆదాయం వసూలు చేసిందని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పి సంస్కరణలు సవరణ చేస్తామని చెప్పి మెజారిటీ కోసం 400 సీట్లు అడుగుతున్నారని తెలిపారు. అసమానతలు పెరగకుండా ఉండాలంటే బిజెపికి వ్యతిరేకంగా, కాంగ్రెస్ అనుకూలంగా ఓటు వేసి మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు గెలిపించాలని ప్రొఫెసర్ కోదండరాం అభ్యర్థించారు. ఇందుకోసం ప్రచార విస్తృతం చేసేందుకు అన్ని ప్రజా సంఘాలు, చిన్న పార్టీలతో మాట్లాడుతున్నామని చెప్పారు.

అందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి మీటింగులు ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. అలాగే ఎందుకుగాను కరపత్రాలను కూడా పంపిణీ చేయనున్నామని వివరించారు. ఈ సమావేశంలో రైతు స్వరాజ్ వేదిక కన్వీనర్ కానుగంటి రవి, టిఆర్టిఎఫ్ మాజీ రాష్ట్ర అధ్యక్షులు కొండల్ రెడ్డి , టిపిటిఎఫ్ మెదక్ జిల్లా మాజీ అధ్యక్షులు ముత్యాలు, డిబి ఆనంద్, మైనారిటీ నాయకులు తాహిర్ బాయ్, షఫీ, ఎండి జాకీర్ మధుసూదన్ రెడ్డి, హనుమంత్ రెడ్డి పాపన్నపేట మాజీ జడ్పిటిసి మల్లప్ప, రామయంపేట్ మహిళా నాయకురాలు అశ్విని, రమేష్ గౌడ్, తెలంగాణ జన సమితి నాయకులు పాల్గొన్నారు .

Advertisement

తాజా వార్తలు

Advertisement