వాజేడు (ప్రభ న్యూస్ ): ఏజెన్సీ ప్రాంతంలో ఏవిటి వ్యవసాయం రైతులకు కొంతమేర లాభాలను చేకూర్చడం తో ఎక్కువ మంది ఆ తరహా సాగు చేయడానికి మక్కువ చూపిస్తున్నారు. రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని ఆ కంపెనీలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి రైతులను దోచుకోవడం మొదలుపెట్టారు. ఏవిటి వ్యవసాయం చేసే ప్రతి రైతు తను సూచించిన పెస్టిసైడ్స్ షాపులోనే విత్తనాలు కొనుగోలు చేయాలని ఆంక్షలు పెట్టాడు.
రైతులు ముందస్తుగానే తట్టలు బుట్టలు కొనుగోలు చేయాలని ఆ రైతులకు మాత్రమే ఏవిటి కంపెనీ ద్వారా వ్యవసాయం చేయడానికి అవకాశం కల్పిస్తామని నిబంధనలు పెట్టడంతో తప్పనిసరి పరిస్థితుల్లో రైతులు అధిక భారం అయినప్పటికీ ఏవిటి వ్యవసాయం కొనసాగిస్తున్నారు. కంపెనీ ఉద్యోగి ఏజెంట్ల తో చేతులు కలిపి 3300 విలువచేసే విత్తనాలను 5,000 రూపాయలకు విక్రయించడం అదేవిధంగా ఏడు వందల రూపాయల విలువ చేసే తట్టలు బుట్టలు 15 వందల రూపాయలకు కట్టబెడుతూ కమీషన్లు పొందుతున్నారు.
కమీషన్లకు కక్కుర్తిపడి రైతులపై లేనిపోని ఆంక్షలు విధించడంతో ఏవిటి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొదట్లో ఏవిటి వ్యవసాయం పై మక్కువ చూపిన రైతులు నేడు ఏవిటి వ్యవసాయం వద్దు బాబో అనే పరిస్థితి ఏర్పడింది. రైతులు విత్తనాలు ఎక్కడ తీసుకున్నా ఏవిటి నిబంధనల ప్రకారమే రైతులు వ్యవసాయం కొనసాగించాలి అలాంటిది వేరే పెస్టిసైడ్స్ దుకాణాలలో విత్తనాలు కొనుగోలు చేయరాదని తాము అందించిన విత్తనాలతో మాత్రమే ఏవిటి వ్యవసాయం కొనసాగించాలని హుకుం జారీ చేయడంతో రైతులు విత్తనాలకు ఎక్కువ ఖర్చు అయినా ఆ ఉద్యోగి సూచించిన పెస్టిసైడ్స్ షాపులోనే విత్తనాలు కొనుగోలు చేశారు ఆ విత్తనాలతో మిర్చి పంట సాగు చేయడం తో రెడ్ రైస్ రకం మిర్చి పంట వేరు వ్యవస్థ వృద్ధి చెందక రైతులు మిర్చి పంటలు దున్నేస్తున్నారు.
ఇలా రైతులను అడుగడుగునా మోసాలకు గురి చేస్తున్న కంపెనీ ఉద్యోగి పై పలువురు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఏజెంట్లతో కుమ్మక్కై ఏవిటి కంపెనీలలో లేనటువంటి నిబంధనలు రైతుల పై రుద్దటం తో చిన్న సన్నకారు గిరిజన రైతులు అధిక భారానికి గురవుతున్నామని వాపోతున్నారు. ఏవిటి వ్యవసాయం లాభసాటిగా ఉన్నప్పటికీ అందులో పనిచేసే ఉద్యోగి పెడుతున్న ఆంక్షలతో రైతులు ఏవిటి వ్యవసాయం అంటేనే మొహం చాటేసే పరిస్థితి నేడు ఏర్పడింది.ఏవిటి వ్యవసాయం కొంతమందికి మాత్రమే వరంగా మారింది ఆర్ ఓ ఎఫ్ ఆర్ ఏవిటి వ్యవసాయం చేసే రైతులకు ఉపయోగకరంగా ఉంది ఏవిటి కంపెనీపై రైతుల్లో మంచి నమ్మకం ఉన్నప్పటికీ అధికారి చేస్తున్న నిర్వాకం వలన కంపెనీకి చెడ్డపేరు వచ్చి పడుతుంది దీనితో ఏజెన్సీ ప్రాంతంలో ఏవిటి కంపెనీ ఉనికిని కోల్పోవాల్సిన పరిస్థితి నేడు ఏర్పడనుంది.
కంపెనీ ఉద్యోగా?.. కమిషన్ ఏజెంటా? రైతులకు ఈ ఆంక్షలేమిటి